తెలుగు విద్యార్లులు (గ్రేట్‌

తెలుగు విద్యార్లులు (గ్రేట్‌ పలు విభాగాల్లో జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ స్థాయిలో నిర్వహించిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూట్‌ టెస్టు ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌)లో తెలుగు విద్యార్థులు మరోసారి ఉత్తమ ర్యాంకులను సొంతం చేసు కున్నారు.



ఈసీఈలో ఎ.పవన్‌కుమార్‌రెడ్డి, ఏరో స్పేస్‌లో క.భరత్‌కుమార్‌, ఇన్‌స్టుమెంటే షన్‌ ఇంజినీరింగ్‌లో సాయిసందీప్‌ మొదటి ర్యాంకు దక్కించుకున్నారు. పలు బ్రాంచీల్లో 20 లోపు ర్యాంకులను సాధించి ఏపీ, తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. పరీక్ష రాసిన విద్యా ర్థుల్లో 18.80 శాతం మంది మాత్రమే ఇత్తీర్డు లయ్యారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రతిష్టా త్మక విద్యాసంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశించేందుకు ఐఐటీలు సంయుక్తంగా ఏటా గేట్‌ను


 నిర్వహిస్తున్నాయి. దీంట్లో సాధించిన స్కోర్‌ ఆధారంగా ఓఎన్‌జీసీ, గెయిల్‌ తదితర 20 సంస్థలు నేరుగా ముఖాముఖీకి ఆహ్వానించి ఉద్యోగాలకు ఎంపిక చేసుకుం టున్నాయి. ఈ సారి ఫిబ్రవరి 1, 2, 8, 9 తేదీల్లో 25 సబ్జెక్ట లకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలను నిర్వహిం చారు. ఐఐటీ ఢిల్లీ శుక్రవారం మధ్యాహ్నం ర్యాంకులను వెల్లడించింది. ఒక్కసెరి అర్హత సాధిస్తే ఆ స్కోర్‌కు మూడేళ్ల వరకు గుర్తింపు ఉంటుంది. దేశవ్యాప్తంగా మొత్తం 6.58 లక్షల మంది దరఖాస్తు


 చేయగా.. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1.24 లక్షల మంది (ఏపీ 61,/01 మంది, తెలంగాణ 6281) ఉన్నారు. ఈ సారి ఈడబ్ఞ్యూఎస్‌ అమలు చేసినా కటాఫ్‌ జనరల్‌ విభాగంతో సమానంగానే పరిగణిం చారు. సీట్ల భర్తీలో మాత్రం ప్రత్యేక కోటా అమలు చేస్తారు. వరంగల్‌ నిట్‌ విద్యార్థులు పలువురు 4 నుంచి 200లోపు ర్యాంకులు సాధించారని సంచాలకుడు ఆచార్య రమణా రావు తెలిపారు. ఐఐటీలో ఎంటెక్‌ పూర్తి చేసి, బాబా అణు పరిశోధన సంస్థ(బార్క్‌)లో సైంటిఫిక్‌ అధికారి కావాలన్నదే తన లక్ష్యమని పవన్‌కుమార్‌ రెడ్డి 'న్యూస్‌టుడే'తో చెప్పారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "తెలుగు విద్యార్లులు (గ్రేట్‌"

Post a Comment