ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేత

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ను నిలిపివేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పుతో కోడ్‌ను ఎత్తివేశారు. కరోనా ప్రభావంతో రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. అప్పటివరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

అయితే ఎన్నికల కమిషనర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. ఎన్నికలు నిలిపివేస్తే 14వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోతాయని ఆందోళ వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించారు




ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ఏపీ ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. అయితే ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేత"

Post a Comment