'నీట్‌' అర్హుల జాబితా విడుదల

ఎపి నుంచి మెడికల్‌లో 6,600, డెంటల్‌లో 538 మంది అభ్యర్థులు 
- జిఒ 43పై స్పష్టత వస్తేనే కౌన్సిలింగ్‌ 
- ఎన్‌టిఆర్‌ యూనివర్సిటీ విసి శ్యాంప్రసాద్‌ 
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో 
నీట్‌-2020లో రాష్ట్రం నుంచి అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ విసి శ్యాంప్రసాద్‌ గురువారం వెల్లడించారు. ఎపి నుంచి పిజి మెడికల్‌ విభాగానికి 6,600 మంది, పిజి డెంటల్‌ విభా గానికి 538 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు తెలి పారు. వివరాలను మీడి యాకు తెలిపారు. పిజి మెడ ికల్‌కు దేశవ్యాప్తంగా 1,60,876 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని, 96,626 మంది అర్హత సాధించారని తెలిపారు

ఎపి నుంచి హాజరైన 11,635 మందిలో 6,600 మంది అర్హత సాధించారని తెలిపారు. పిజి డెంటల్‌ విభాగంలో దేశవ్యాప్తంగా 26,416 మంది పరీక్షకు హాజరైతే 15,910 మంది అర్హత సాధించారని పేర్కొన్నారు. ఎపి నుంచి హాజరైన 924 మందిలో 538 మంది అర్హత సాధించారని చెప్పారు. గతేడాది మెడికల్‌లో 978 సీట్లు, డెంటల్‌లో 385 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఫైనల్‌ మెరిట్‌ తుది జాబితాను ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందిన తరువాతే యూనివర్సిటీ నోటిఫికేషన్‌లో 


పొందుపరుస్తామన్నారు. ఈ ఏడాది 100 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. అర్హత సాధించిన అభ్యర్థులందరూ కౌన్సిలింగ్‌లో అన్ని ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. మే 31లోపు కౌన్సిలింగ్‌ ప్రక్రియను పూర్తిచేయాలని అన్నారు. అయితే 43 జిఒపై స్పష్టత వచ్చిన తరువాతే కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రభుత్వానికి నెలలోపే నివేదిక ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ కె.శంకర్‌, జాయింట్‌ రిజిస్ట్రార్‌ అనురాధా తదితరులు పాల్గొన్నారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "'నీట్‌' అర్హుల జాబితా విడుదల"

Post a Comment