వ్యక్తుల మధ్య దూరంపై విద్యార్థులు అవగాహన కల్పించాలి
వ్యక్తుల మధ్య దూరంపై
విద్యార్థులు అవగాహన కల్పించాలి
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
ఈనాడు, అమరావతి: కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం విద్యార్థులు వ్యక్తిగత ఎడమ పాటిస్తూ, కుటుంబ సభ్యులకు చుట్టుపక్కల వారికి అవగా హన కల్పించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు.
ఈ విష యంలో బైతన్యం తీసుకొచ్చే సత్తా విద్యార్థులకు ఉందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు వారి పరిధిలోని విద్యార్థులకు ఇ-మెయిల్ ద్వారా పిలుపునివ్వాలని నిర్దశించారు. శనివారం రాజ్‌భవన్‌లో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి, ఇతర అధికారులతో గవర్నర్ సమీక్ష నిర్వహించారు.
విశ్వవిద్యాలయాల్లో పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు విశ్వవిద్యాలయాల్లోని మౌలిక వసతులను వినియోగించుకోవాలని గవర్నర్ సూచించారు.
0 Response to "వ్యక్తుల మధ్య దూరంపై విద్యార్థులు అవగాహన కల్పించాలి"
Post a Comment