కరోనా దెబ్బకు దేశం లాక్ డౌన్ అయింది
అత్యవసరేతర వ్యాపారాలు, పరిశ్రమలు, కంపెనీలూ మూతపడ్డాయి. ఈ సంక్షోభ
పరిణామంలో ప్రైవేట్ రంగం ఉద్యోగాలకు లేదంటే జీతాలకు కోత పెట్టే అవకాశం
లేకపోలేదు. అదే గనుక జరిగితే, వేతన జీవులకు ఆర్థిక కష్టాలు తప్పవు. పొదుపు
సొమ్ము ఉంటే పర్వాలేదు. ఈ విపత్కరం నుంచి ఏదో రకంగా గట్టెక్కవచ్చు.
ఆపద్ధర్మ నిధి లేకుంటే ఏంటి పరిస్థితి..? జేబు ఖాళీ అయితే కుటుంబాన్నెలా
సాకేది..? ఈ తరుణంలో చేబదులు పుట్టే అవకాశాలూ తక్కువే. ఆర్థిక సాయానికి
అన్ని దారులు మూసుకుపోయిన ఉద్యోగికి చివరికి పీఎఫ్ సొమ్మే దిక్కు.. కరోనా
కబళిస్తోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా పీఎఫ్ సొమ్ము
విత్‌డ్రా నిబంధనలను సడలించింది. కరోనా కష్టాల నుంచి గట్టెక్కేందుకు
పీఎఫ్ ఖాతాలో ఇప్పటివరకు జమ అయిన సొమ్ములో 75 శాతం లేదా మూడు నెలల
వేతనానికి (ఏది తక్కువైతే అది) సమానమైన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వీలు
కల్పించింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు
ఇది కూడా మిగతా పీఎఫ్ అడ్వాన్సుల
తరహా దరఖాస్తు ప్రక్రియే. ప్రత్యేక విధానమంటూ ఏం లేదు. చందాదారులు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి
మార్గదర్శకాలను విడుదల చేయనుంది
అడ్వాన్సుగా పొందగలిగే సొమ్మును మీ పీఎఫ్ జీతం (కనీస వేతనం+ కరువు భత్యం) ఆధారంగా లెక్కిస్తారు
కోవిడ్ అడ్వాన్సు క్లెయిమ్‌లను మిగతా వాటికంటే అధిక ప్రాధాన్యమిచ్చి ప్రాసెస్ చేయడం జరుగుతుందని ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది
0 Response to "పీఎఫ్ అడ్వాన్స్.. 75% వరకు"
Post a Comment