మార్చి 16 నుంచి ఆన్‌లైన్ లావాదేవీలు బంద్!
బిట్/క్రెడిట్ కార్డుల భద్రత మరింత పెంచేందుకు ఆర్‌బీఐ నిర్ణయం
ముంబయి: మీకు డెబిట్/క్రెడిట్ కార్డులున్నాయా? వాటితో మీరు ఆన్‌లైన్‌లో ఏమైనా లావాదేవీలు చేస్తున్నారా? మార్చి 16 నుంచి అది కుదరకపోవచ్చు! ఎందుకంటే మీ డెబిట్/క్రెడిట్ కార్డులను మరింత సురక్షితంగా మార్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) పటిష్ఠ చర్యలు చేపట్టింది. అనుచితంగా కార్డులను వాడటం, బ్యాంకింగ్ మోసాలను అడ్డుకొనేందుకు అన్ని బ్యాంకులకు కొన్ని నిబంధనలను జారీ చేసింది.
ఈ నిబంధనల ప్రకారం మార్చి 16 నుంచి మీ కార్డులతో కేవలం స్థానిక (డొమెస్టిక్) లావాదేవీలు చేసేందుకు మాత్రమే వీలుంది
ఆర్బీఐ నిబంధనల ప్రకారం నష్టభయాన్ని బేరీజు వేసుకొని ప్రస్తుతం ఉన్న కార్డుల్లో ఆన్‌లైన్, అంతర్జాతీయ లావాదేవీలను డీయాక్టివేట్ చేసే అధికారం బ్యాంకులకు ఉంది. ఇంతకు ముందు తీసుకున్న కార్డుల ద్వారా ఇప్పటి వరకు ఆన్‌లైన్, అంతర్జాతీయ, కాంటాక్ట్‌లెస్ లావాదేవీలు చేయకపోయినా బ్యాంకులు ఆ సదుపాయాలను డీయాక్టివేట్ చేస్తాయి. ఇకపై వినియోగదారులు తమ కార్డులను సంబంధిత ఏటీఎంల ద్వారా స్విచ్ ఆఫ్/ఆన్ చేసుకొనే సౌకర్యం కల్పిస్తున్నాయి. ఎటువంటి లావాదేవీలు చేయనప్పుడు ఈ సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే భారతీయ స్టేట్‌బ్యాంకు చాలామంది వినియోగదారులకు కొన్ని సదుపాయాలను డిసేబుల్ చేశామని అవసరమైతే తమకు తెలియజేయాలని సందేశాలు పంపించింది
0 Response to "మార్చి 16 నుంచి ఆన్‌లైన్ లావాదేవీలు బంద్!"
Post a Comment