ఏప్రిల్ 1 నుండి బ్యాంకుల విలీనం.. ఏయే బ్యాంకులు విలీనం అవుతున్నాయో తెలుసా
ఇక పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా కుదించే విలీన పక్రియ ఏప్రిల్ 1 నుండి అమలులోకి రాబోతుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం వేగవంతం చేశామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకుల విలీన విషయమై బ్యాంకులతో ఎప్పటికప్పుడు కేంద్రం చర్చలు జరుపుతూ ఉంది.
కెనరా బ్యాంకు సిండికేట్ బ్యాంకులో విలీనం, ఓరియెంటెల్ బ్యాంకు అఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం అవుతున్నాయి. అలాగే ఆంద్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు యూనియన్ బ్యాంకు లో, ఇండియన్ బ్యాంకు లో అలహాబాద్ బ్యాక్ విలీనం అవుతున్నాయి.
దేశంలో ప్రపంచ స్థాయి బ్యాంకులను తయారీ చేసేందుకు అలాగే సంక్షోభంలో చిక్కుకున్న బ్యాంకింగ్ వ్యవస్థను గట్టెక్కించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది
ఇక కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలో 12 ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రమే ఉండనున్నాయి
0 Response to "ఏప్రిల్ 1 నుండి బ్యాంకుల విలీనం.. ఏయే బ్యాంకులు విలీనం అవుతున్నాయో తెలుసా"
Post a Comment