ఆంగ్లంపై పట్టుకు బిడ్జ్ కోర్సు
9 పాఠ్యాంశాల రూపకల్పనలో అధికారులు
మార్చి నుంచి ఏప్రిల్ వరకు నిర్వహణ
ఈనాడు, అమరావతి: విద్యార్థులకు ఆంగ్ల భాషపై
బ్రిడ్జి కోర్సు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ
పాఠ్యాంశాలను సిద్ధం చేస్తోంది. కోర్సును మార్చిలో
ప్రారంభించి ఏప్రిల్ 22వరకు నిర్వహించేలా అధికారులు
(ప్రణాళిక రూపొందించారు. అవసరమైతే ప్రాథమిక
స్థాయిలో నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌లోనూ
మార్పులు చేయాలని యోచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశా
లల్లో ప్రాథమిక స్థాయిలో 20లక్షల వరకు విద్యార్థులు
న్నారు. వీరిని రెండు గ్రేడ్లుగా విభిజించి తరగతులు
నిర్వహించనున్నారు. ఆంగ్లం మాట్లాడడం, అర్ధం చేసు
కోగలుగుతున్న వారిని ఒక బృందంగా ఏర్పాటుచేయను
న్నారు. 89 రోజులు బ్రిడ్డికోర్సు నిర్వహించనున్నారు.
రోజుకు 4గంటలు బోధించనున్నారు. ఆంగ్లంపై పట్ట
సాధించేందుకు ఆంగ్ల భాష సినిమాలు, ఇతర అంశా
లను టీవీల ద్వారా ప్రదర్శించనున్నారు. ఇందుకు అంత
ర్జాలం, టీవీ ఇతర ఖర్చులకు ఒక్కో కేంద్రానికి రూ. 5వేల
వరకు వ్యయమవుతుందని అంచనావేశారు.
క. తల్లిదండ్రులకు పుస్తకాలు.
1-6తరగతుల వరకు ప్రతి సబ్టెక్టుకు ఒక వర్క్‌బుక్
ఇవ్వనున్నారు. వీటిని పాఠశాలల్లోనే విద్యార్థులతో
రాయించేలా రూపొందిస్తున్నారు. ఎలా బోధించాలి?
ఎలాంటి మెలకువలు పాటించాలనేది వివరిస్తూ ఉపాధ్యా
యులకు హ్యాండ్‌బుక్ తీసుకొస్తున్నారు. తల్లిదండ్రులు
పాఠశాలల కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావడానికి
మరో మార్గదర్శక పుస్తకాన్ని తీసుకొస్తున్నారు. తల్లిదం
డ్రులు పాఠశాలలను పరిశీలించడం, పిల్లల చదువులపై
వివరాలు తెలుసుకునేలా పుస్తకాన్ని తీసుకురానున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 8వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వప్రా
థమిక విద్యను ప్రారంభించేందుకు సమగ్ర శిక్ష అభియాన్
కింద కేంద్రం నిధులు విడుదల చేసింది. ప్రభుత్వ పాఠ
శాలల ఆవరణ, వీటికి సమీపంలోని కేంద్రాల్లో పూర్వపా
థమిక విద్యను నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు.
దీనిపై ఇప్పటికే సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు,
మహిళ, శిశు సంక్షేమశాఖ అధికారులతో సమీక్షలు జరి
పారు. మరోసారి సమావేశమై వీటిపై నిర్ణయం తీసుకునే
అవకాశముంది. ఇవికాకుండా సీఆర్‌డీఏ పరిధిలోని
సుమారు [0 అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ పూర్వప్రాథమిక
విద్యను ప్రారంభించేందుకు కసరత్తుచేస్తున్నారు. ఇందుక
వసరమైన పాఠ్యాంశాల కోసం సమగ్రశిక్ష అభియాన్ సహ
కారం తీసుకుంటున్నారు. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ
మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) పూర్వ ప్రాథమిక విద్య పాఠ్యాం
శాలను రూపొందించింది. వీటి ఆధారంగా మెటీరియల్
రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు
0 Response to "ఆంగ్లంపై పట్టుకు బిడ్జ్ కోర్సు"
Post a Comment