అమ్మాయిలూ..అందిపుచ్చుకోండి
అమ్మాయిలూ..అందిపుచ్చుకోండి!
ఆమె కర్తవ్య దీక్షకు ‘శాశ్వత’ రక్షణ
త్రివిధ దళాల్లో వివిధ కొలువులు
షార్ట్ సర్వీస్ కమిషన్‌లో ఎంపికైనవారికి ముందుగా పదేళ్లు ఉద్యోగంలో కొనసాగే అవకాశం దక్కుతుంది. ఆ తర్వాత అప్పటి అవసరాలు, అభ్యర్థుల ఆసక్తి, సమర్థత ప్రాతిపదికన మరో నాలుగేళ్లు సర్వీస్ పొడిగిస్తారు. అనంతరం ఈ విధానంలో ఎంపికైన మహిళలు తప్పనిసరిగా వైదొలగాల్సి వచ్చేది. అదే పురుషులైతే అప్పటి అవసరాలు, ఆసక్తి, సమర్థత ప్రాతిపదికన పర్మనెంట్ కమిషన్‌లోకి తీసుకునేవారు. మహిళలకు ఈ అవకాశం ఉండేది కాదు. ఈ విధానంలో వైదొలిగినవారికి గ్రాట్యుటీ తప్ప పింఛను, ఇతర ప్రయోజనాలు దక్కేవి కాదు. కెరియర్ మధ్యలోనే ముగిసిపోయేది. దీంతో కొత్తగా రక్షణేతర ఉద్యోగాల కోసం ప్రయత్నించుకోవాల్సి వచ్చేది.
సుప్రీం కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో షార్ట్ సర్వీస్ కమిషన్ విభాగంలో ఎంపికైన మహిళా ఉద్యోగులనూ శాశ్వత విధుల్లోకి తీసుకుంటారు. దీంతో పదవీ విరమణ వయసు వచ్చేవరకు ఉద్యోగంలో కొనసాగవచ్చు. కనీసం 20 ఏళ్ల సేవలు అందించినవారు పింఛను, ఇతర సదుపాయాలన్నీ పురుష ఉద్యోగులతో సమానంగా అందుకోవచ్చు. ఈ రకంగా సైన్యంలో సమన్యాయానికి ఆస్కారం ఏర్పడింది
ప్రయోజనాలెన్నో..
యూపీఎస్సీతోపాటు ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీలు విడిగా పలు పరీక్షలు నిర్వహించి అవివాహిత మహిళలను విధుల్లోకి తీసుకుంటున్నాయి. ఇవన్నీ యూజీ, పీజీ అర్హతలతో ఉన్న సమాన స్థాయి ఉద్యోగాలు. అందువల్ల రక్షణ రంగంలో ఏ విభాగంలో చేరినప్పటికీ జీతం, హోదా, ప్రయోజనాలన్నీ ఒకేలా ఉంటాయి. కొత్తగా విధుల్లో చేరినవారు ఆర్మీలో అవకాశం లభిస్తే లెఫ్టినెంట్, నేవీలో అయితే సబ్ లెఫ్టినెంట్, ఎయిర్ ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాలు పొందుతారు.
చేరిన విభాగాన్ని అనుసరించి దాదాపు ఏడాది నుంచి 18 నెలల శిక్షణ ఉంటుంది. ఈ వ్యవధిలో నెలకు రూ.56,100 (లెవెల్ 10) స్టైపెండ్ చెల్లిస్తారు. విధుల్లో చేరిన తర్వాత రూ.56,100 మూలవేతనానికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనంగా లభిస్తాయి. ఏ విభాగంలో చేరినప్పటికీ రూ.15,500 మిలటరీ సర్వీస్ పే(ఎంఎస్‌పీ) ప్రతి నెలా అందుతుంది. ఒక వేళ పైలట్ పోస్టులో చేరితే ఎంఎస్‌పీతోపాటు ప్రతినెలా రూ.25,000 ఫ్లయింగ్ అలవెన్సు చెల్లిస్తారు. ఇంజినీర్లకు (గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో విధులు నిర్వర్తించేవారికి) సైతం ట్రేడ్ అలవెన్సులు ఉంటాయి. ఇవే కాకుండా నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒక్కొక్కరికీ నెలకు రూ.2250 చొప్పున ఇద్దరు పిల్లలకు చెల్లిస్తారు. ఒకవేళ వసతి గృహంలో ఉండి చదువుకుంటే ఒక్కొక్కరికీ నెలకు రూ.6750 చొప్పున హాస్టల్ సబ్సిడీ అందుతుంది. గ్రూప్ ఇన్సూరెన్స్, కుటుంబానికి ఆరోగ్య ఇన్సూరెన్స్, తక్కువ ధరకు క్యాంటిన్ సామగ్రి, రాయితీతో కూడిన ప్రయాణాలు, నియామకాలు, చదువుల్లో పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్లు..ఇలా ఎన్నో ప్రోత్సాహాలున్నాయి. 60 వార్షిక, 20 సాధారణ సెలవులు ఉంటాయి. మొదటి నెల నుంచే రూ.లక్షకుపైగా వేతనం అందుకోవచ్చు. విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాన్ని బట్టి ఫీల్డ్ ఏరియా, హై ఆల్టిట్యూడ్, ట్రాన్స్‌పోర్టు ఆలవెన్సులు దక్కుతాయి

తక్కువ
వ్యవధిలోనే పదోన్నతులు అందుకోవచ్చు. ఆర్మీలో..రెండేళ్ల సర్వీస్‌తో
కెప్టెన్, ఆరేళ్ల సర్వీస్ పూర్తిచేసుకుంటే మేజర్, 13 ఏళ్ల సర్వీస్‌తో
లెఫ్టినెంట్ కల్నర్ హోదాకి చేరుకోవచ్చు. నేవీ, ఎయిర్ ఫోర్స్‌ల్లోనూ
ఇదేవిధంగా పదోన్నతులు లభిస్తాయి. తర్వాతి స్థాయి ప్రమోషన్లు మాత్రం సేవలు,
పరీక్షల్లో చూపిన ప్రతిభ ప్రాతిపదికన కేటాయిస్తారు..
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లలో దాదాపు అన్ని పోస్టులకూ ఏడాదికి రెండు సార్లు ప్రకటనలు వెలువడతాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ టెస్టుల ద్వారా ఖాళీలు భర్తీ చేస్తారు. ఎంపికలో ఆప్టిట్యూడ్, ఆంగ్లంలో ప్రావీణ్యం, సామాజిక అంశాలపై అవగాహన, మానసిక, శారీరక దృఢత్వం గమనిస్తారు.
వెబ్‌సైట్లు: https://joinindianarmy.nic.in, www.joinindiannavy.gov.in , http://indianairforce.nic.in, https://upsc.gov.in/
ఆర్మీ
* గ్రాడ్యుయేట్ యూపీఎస్సీ: సీడీఎస్‌ఈతో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ(ఓటీఏ) పోస్టులు భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 19 - 25 ఏళ్లలోపు ఉండాలి.
* గ్రాడ్యుయేట్ నాన్ యూపీఎస్సీ: ఇందులో ఎన్‌సీసీ స్పెషల్, జడ్జ్ అడ్వొకేట్ జనరల్ (జాగ్) ల ద్వారా పోస్టులు భర్తీ చేస్తారు. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టులకు డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలి. ఎన్‌సీసీ సీనియర్ డివిజన్ ఆర్మీలో రెండేళ్ల అనుభవం, సి సర్టిఫికెట్ పరీక్షలో కనీసం బి గ్రేడ్ తప్పనిసరి. జేఏజీ(జాగ్) ఎంట్రీకి 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణత, వయసు 27 ఏళ్లలోపు ఉండాలి.
* గ్రాడ్యుయేట్ టెక్ ఎంట్రీ: సంబంధిత బ్రాంచ్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ చదివుండాలి. 27 ఏళ్లలోపు వయసువారు అర్హులు.
*మిలటరీ నర్సింగ్ సర్వీస్: బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసినవారు ఇందులో చేరవచ్చు. ఖాళీలు ఉన్నప్పుడే ఈ ప్రకటన వెలువడుతుంది

నేవీ
నేవల్ ఆర్కిటెక్చర్, అబ్జర్వర్, ఎడ్యుకేషన్, లాజిస్టిక్స్, లా, ఏటీసీ, పైలట్ (మేరీటైమ్ రికనయిసెన్స్ స్ట్రీమ్), నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ పోస్టులకు మహిళలు అర్హులు
* నేవల్ ఆర్కిటెక్చర్: మెకానికల్/ సివిల్/ ఏరోనాటికల్/ మెటలర్జీ/ నేవల్ ఆర్కిటెక్చర్ విభాగాల్లో ఎందులోనైనా బీఈ/ బీటెక్ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 19 1/2 - 25 ఏళ్లలోపు ఉండాలి.
* అబ్జర్వర్: బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులు అర్హులు. వయసు 19- 24 ఏళ్లలోపు ఉండాలి.
* ఎడ్యుకేషన్ విభాగం: పీజీలో నిర్దేశిత సబ్జెక్టుల్లో కనీసం ద్వితీయ శ్రేణితో ఉత్తీర్ణత సాధించాలి. యూజీలోనూ కొన్ని సబ్జెక్టులు చదివుండడం తప్పనిసరి లేదా నిర్దేశిత బ్రాంచ్‌ల్లో ఇంజినీరింగ్ పూర్తిచేయాలి. వయసు 21 - 25 ఏళ్లలోపు ఉండాలి.
* లాజిస్టిక్స్: బీటెక్ / ఎంబీఏ / ఎంసీఏ / ఎమ్మెస్సీ (ఐటీ) వీటిలో ఎందులోనైనా ప్రథమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. వర్క్స్ విభాగానికి బీటెక్ (సివిల్) లేదా బీఆర్క్ వాళ్లు అర్హులు. క్యాటరింగ్ పోస్టులకు హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఎమ్మెస్సీ/ ఎంబీఏ లేదా ప్రథమ శ్రేణితో పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తిచేసినవాళ్లు అర్హులు. వయసు 19 1/2 - 25 ఏళ్లలోపు ఉండాలి.
* లా: ఈ పోస్టులకు ఎల్‌ఎల్‌బీ అవసరం. వయసు 22 - 27 ఏళ్లలోపు ఉండాలి.
* ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ): ఈ ఖాళీలకు ఇంజినీరింగ్ ఉత్తీర్ణత, వయసు 19 1/2 - 25 ఏళ్లలోపు ఉండాలి.
* పైలట్ జనరల్: ఈ పోస్టులకు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు అర్హులు. వయసు 19 - 24 ఏళ్లలోపు ఉండాలి.
* నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ (ఎన్‌ఏఐ): ఈ విభాగానికి నిర్దేశిత బ్రాంచీల్లో బీఈ/ బీటెక్ చదివినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 19 1/2 - 25 ఏళ్లలోపు ఉండాలి

ఎయిర్ ఫోర్స్
వాయుసేనలో ఉద్యోగాలను ఎయిర్ ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏఎఫ్‌క్యాట్) తో భర్తీ చేస్తారు. ఈ విధానంలో ఎంపికైన మహిళలు పైలట్ కావచ్చు. శిక్షణలో మేటి ప్రతిభ చూపినవారిని ఫైటల్ పైలట్‌గానూ తీసుకుంటారు. ఏఎఫ్‌క్యాట్‌లో ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్), ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ (ఫ్లయింగ్) ఉద్యోగాలు లభిస్తాయి.
* ఫ్లయింగ్ బ్రాంచ్: ఈ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంటర్ / ప్లస్ 2 లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి. వయసు 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తు కనీసం 162.5 సెం.మీ ఉండాలి. ఎలాంటి దృష్టి దోషం ఉండరాదు.
* గ్రౌండ్ డ్యూటీ - టెక్నికల్ బ్రాంచ్: ఏరోనాటికల్ ఇంజినీర్ (ఎల‌్రక్టానిక్స్/ మెకానికల్) పోస్టులకు సంబంధిత లేదా అనుబంధ విభాగాల్లో 60 శాతం మార్కులతో బీటెక్/ బీఈ పూర్తిచేసినవాళ్లు అర్హులు. ఇంటర్/ +2లో ఫిజిక్స్, మ్యాథ్స్ ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
* గ్రౌండ్ డ్యూటీ - నాన్ టెక్నికల్ బ్రాంచ్: ఇందులో అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్, అకౌంట్స్, ఎడ్యుకేషన్ విభాగాలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్ విభాగానికి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అకౌంట్స్ శాఖకు 60 శాతం మార్కులతో బీకాం పూర్తిచేసినవారు అర్హులు. ఎడ్యుకేషన్ విభాగానికి ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు నిర్దేశిత సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ అన్నిపోస్టులకు వయసు 20 నుంచి 26 ఏళ్లలోపు, ఎత్తు 152 సెం.మీ.ఉండాలి.
* ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ: ఎన్‌సీసీ సీనియర్ డివిజన్ సి సర్టిఫికెట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వీరికి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీతోపాటు 10+2 లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లోనూ 60 శాతం ఉండాలి.
* మెటీరియాలజీ బ్రాంచ్: ఏదైనా సైన్స్ స్ట్రీమ్‌లో 50 శాతం మార్కులతో పీజీ తోపాటు యూజీలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 20- 26 ఏళ్లలోపు ఉండాలి

0 Response to "అమ్మాయిలూ..అందిపుచ్చుకోండి"
Post a Comment