పీపీఎఫ్ రూల్స్ మారాయి ఇలా..?
ఇంటర్నెట్‌డెస్క్: ప్రభుత్వం గతేడాది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. డిపాజిట్ల పొడిగింపు.. వడ్డీ విధానాల్లో కీలకమైన మార్పులు చేసింది. వీటిల్లో కొన్ని నిబంధనలను సడలిస్తే.. మరికొన్ని నిబంధనలను బిగించింది. మొత్తానికి పీపీఎఫ్ నిర్వహణను సులభతరం చేసే ప్రయత్నం చేసింది. చిన్నమొత్తాల పొదుపునకు ఇదే కీలకం కావడంతో ప్రభుత్వం దీనిపై మరింత శ్రద్ధ చూపిస్తోంది. ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాలపై ప్రభుత్వం 7.9శాతం వడ్డీ చెల్లిస్తోంది.
* పీపీఎఫ్ ఖాతాను మెచ్యూరిటీ తర్వాత మరికొంత కాలం పొడిగించుకోవచ్చు. పీపీఎప్ ఖాతా లేదా పొడిగించిన పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ అయిన తర్వాత ఏడాదిలోగా దీనిని చేయాలి
అదే విధంగా మెచ్యూరిటీ తర్వాత కూడా పీపీఎఫ్ ఖాతాను ఎటువంటి డిపాజిట్లు చేయకుండానే కొనసాగించొచ్చు. ఉన్న బ్యాలెన్స్‌పై వడ్డీ పొందవచ్చు. ఇలాంటి సందర్భంలో సదరు పీపీఎఫ్ ఖాతాదారు ఏడాదికి ఒక్క సారి మాత్రమే నగదు తీసుకొనే అవకాశం ఉంటుంది.
* గతంలో పీపీఎఫ్‌కు ఏడాదికి 12 డిపాజిట్లను అనుమతించే వారు. కానీ, ఇప్పుడు రూ.50తో గుణించేలా ఎన్నిసార్లైన డిపాజిట్ చేయవచ్చు. ఇది ఏడాదికి రూ.1.5లక్షలను మించకూడదు.
* నివాస హోదా మారినట్లు పాస్‌పోర్టు, వీసా లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్ను కాపీ అందజేసి పీపీఎఫ్ ఖాతాను శాశ్వతంగా మూసివేయవచ్చు. గతంలో కొన్ని రకాల పరిస్థితుల్లో మాత్రమే ప్రభుత్వం దీనికి అనుమతించేంది.
* పీపీఎఫ్ ఖాతా తెరిచాక మూడో ఏట నుంచి ఆరో ఏట మధ్యలో రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పీపీఎఫ్ బ్యాలెన్స్ నుంచి తీసుకొనే రుణంపై వడ్డీ రేటును ప్రభుత్వం 1శాతానికి తగ్గించింది.
* పీపీఎఫ్‌పై తీసుకొనే రుణం 36 నెలల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించలేకపోతే.. బకాయి మొత్తంపై 6శాతం చొప్పున అదనపు వడ్డీ వసూలు చేస్తారు. ఈ విషయాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ ఒక సర్క్యూలర్‌లో వెల్లడించింది
0 Response to "పీపీఎఫ్ రూల్స్ మారాయి ఇలా..?"
Post a Comment