46 వేల ఏళ్ల నాటి పక్షి!

 46 వేల ఏళ్ల నాటి పక్షి!

సైబీరియా మంచులో అవశేషాలు భద్రం

లండన్‌: దట్టమైన ఐస్‌లో చెక్కుచెదరకుండా ఉన్న ఒక పక్షి అవశేషాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది దాదాపు 46వేల సంవత్సరాల నాటిదని తేల్చారు. దీని నుంచి జన్యు పదార్థాన్ని సేకరించారు. చివరి మంచు యుగం ముగింపు సమయంలో ఈ ప్రాంతంలో చోటుచేసుకున్న మార్పులను వెలుగులోకి తీసుకురావడానికి ఇది సాయపడుతుందని పరిశోధకులు తెలిపారు.

తాజాగా వెలుగు చూసినది హార్న్‌డ్‌ లార్క్‌ అనే పక్షి అవశేషమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉత్తర ఐరోపా, ఆసియా మధ్య విస్తరించి ఉన్న సైబీరియాలో ఇది కనిపించింది.  అంతరించిపోయిన వూలీ మామోత్‌, వూలీ రైనో వంటి జీవజాతులకు ఈ ప్రాంతం ఒకప్పుడు ఆవాసంగా ఉండేది. హార్న్‌డ్‌ లార్క్‌ జాతిలో నేడున్న రెండు ఉపతెగలకు మూలాలు.. తాజాగా వెలుగు చూసిన పక్షి తెగలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఉపతెగలు ఆవిర్భవించిన తీరును అర్థం చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని వివరించారు. హార్న్‌డ్‌ లార్క్‌లో వైవిధ్యభరితమైన ఉపతెగల ఆవిర్భావం, నాడు ఆ ప్రదేశంలో భారీ గడ్డి నేలల అంతర్థానం దాదాపుగా ఏకకాలంలోనే జరిగిందని పేర్కొన్నారు


ఇదే ప్రాంతంలో కుక్కపిల్లను పోలిన జీవి అవశేషం కూడా గతంలో వెలుగు చూసింది. అది 18వేల ఏళ్ల నాటిది. దీనికి ‘డోగార్‌’ అని పేరు పెట్టారు. ఇది తోడేలు పిల్లా.. కుక్కపిల్లా అన్నది తేల్చేందుకు పరిశోధన సాగిస్తున్నారు. 50వేల సంవత్సరాల నాటి సింహం పిల్ల, వూలీ మామోత్‌ అవశేషాలు కూడా లభ్యమయ్యాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "46 వేల ఏళ్ల నాటి పక్షి!"

Post a Comment