వాతావరణ శాఖ కొత్త వెబ్‌సైట్
విశాఖపట్నం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): భారత
వాతావరణ శాఖ (ఐఎండీ) కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. దీని ద్వారా
వాతావరణానికి సంబంధించి రైతులు, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని
అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటివరకు
వాతావరణం కోసం ఉన్న వెబ్‌సైట్‌ను ఇకపై పూర్తిగా ఆ శాఖ అధికారుల కు మాత్రమే
పరిమితం చేయనున్నారు. విపత్తులు, వర్షాలు, తుఫానుల సమయాల్లో వాతావరణ
సమాచారం కోసం ప్రయత్నించినప్పుడు వెబ్‌సైట్ మొరాయిస్తుండేది. ఈ నేపథ్యంలో
మరొక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని వాతావరణ శాఖ నిర్ణయించింది. ఈ
మేరకు కొత్తగా http://www. mausam.imd.gov.inబ్‌సైట్‌ను అందుబాటులోకి
తెచ్చారు
0 Response to " వాతావరణ శాఖ కొత్త వెబ్‌సైట్"
Post a Comment