ఇక ఆదాయపు పన్ను కట్టడం మర్చిపోరు

2020 క్యాలెండర్‌ విడుదల చేసిన ఐటీ శాఖ

దిల్లీ: 'అయ్యయ్యో.. పన్ను కట్టడం మర్చిపోయానే. లాస్ట్‌ డేట్‌ చూసుకోలేదే' అనుకునే సందర్భాలు సహజమే. పన్ను సంగతి గుర్తున్నా.. కొన్ని సార్లు గడువు తేదీ మర్చిపోతుంటారు. అలాంటి వారి కోసమే ఆదాయపు పన్ను శాఖ ఓ శుభవార్త చెప్పింది. పన్ను కట్టే సమయం మర్చిపోకుండా ఉండేలా 2020 క్యాలెండర్‌ను రూపొందించి విడుదల చేసింది. 'ఏ రోజున పన్ను కట్టాలి.. చివరి తేదీ ఎప్పుడు' లాంటి వివరాలను ఇందులో పొందుపర్చింది.

'ఫైల్‌ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌' పేరుతో రూపొందించిన ఈ క్యాలెండర్‌ను పన్ను చెల్లింపుదారులకు మెయిల్‌ ద్వారా 



అంతేగాక, తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలోనూ పోస్టు చేసింది. పన్ను చెల్లింపులు, రిటర్నుల దాఖలను మరింత సులభతరం చేసేలా ఐటీశాఖ ఈ క్యాలెండర్‌ను తయారుచేసింది. దీంతో పాటు పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉన్న పలు సేవలను కూడా పేర్కొంది. మరింకెందుకాలస్యం మీరూ.. ఈ క్యాలెండర్‌ను సేవ్‌ చేసుకుని.. సరైన సమయానికి పన్ను చెల్లించండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇక ఆదాయపు పన్ను కట్టడం మర్చిపోరు"

Post a Comment