అమ్మఒడి అర్హుల గుర్తింపు
2న జాబితా ప్రకటిస్తాం : మంత్రి సురేష్
మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేద విద్యార్థులకు జగనన్న అమ్మఒడి వరం లాంటిదని.. ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ముఖ్యమంత్రి వీడియో వీక్షణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అమ్మఒడి పథకాన్ని జనవరి 9న ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు
జిల్లావ్యాప్తంగా 5,67,466 మంది విద్యార్థులను దీనికోసం గుర్తించామని, వీరిలో ప్రస్తుతానికి 4,50,407 మంది అర్హత సాధించారన్నారు. మరో 47,630 వేల మంది విద్యార్థులకు సర్వే పూర్తి కాలేదన్నారు. 69,633 మందికి అమలు చేయడానికి పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 1వ తేదీ నాటికి సర్వే పూర్తి అవుతుందన్నారు.
జనవరి 2న గ్రామ సచివాలయాల్లో అర్హులైన విద్యార్థుల జాబితాను ప్రకటిస్తామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనుమతితో వర్తింపజేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 45 వేల పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల మంది విద్యార్థులు పథకంలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సీఎం వీక్షణ సమావేశంలో ఆర్డీవో ఎం.శేషిరెడ్డి, ఎంఈవోలు సీహెచ్‌పి.వెంకటరెడ్డి, బి.రాందాసునాయక్, సుజాత తదితరులు పాల్గొన్నారు
0 Response to "అమ్మఒడి అర్హుల గుర్తింపు"
Post a Comment