ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్
ఢిల్లీ : బడ్జెట్ సెషన్‌ను జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండు దశల్లో నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ (సిసిపిఎ) సిఫార్సు చేసింది. ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలన్న సిసిపిఎ.. తొలి దశను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండో దశను మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు పేర్కొన్నట్లు (నిన్న) బుధవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండు దశల మధ్య సాధారణంగా నెల రోజుల విరామం ఉంటుంది. బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయించిన నిధులను ఈ కాలంలో పార్లమెంటరీ కమిటీలు పరిశీలిస్తాయి.
0 Response to "ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్"
Post a Comment