ఇక పన్నుల మోత
జిఎస్‌టి శ్లాబు రేట్ల పెంపునకు కేంద్రం యోచన
- 5 నుంచి 6 శాతానికి మార్పు..!
- తగ్గుతున్న రాబడి
న్యూఢిల్లీ : రెవెన్యూ లోటుతో సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు మార్గాలు వివిధ అన్వేషిస్తున్నట్లు కన్పిస్తోంది. ఇందులో భాగంగానే వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)ని పునర్‌వ్యవస్థీకరించి పన్ను రేటును పెంచాలనే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతమున్న 5శాతం శ్లాబును 6 శాతానికి పెంచే అవకాశమున్నట్లు కొన్ని జాతీయ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. 2017 జులై 1న జిఎస్‌టిని అమల్లోకి తెచ్చారు

దీని ప్రకారం వస్తువుల, సేవలపై 5, 12, 18, 28శాతం.. ఇలా నాలుగు శ్లాబుల్లో పన్నులు విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన జిఎస్‌టి మండలి సమావేశాల్లో 28 శాతం శ్లాబులో ఉన్న చాలా వస్తువులపై పన్ను తగ్గించి వాటిని కింది శ్లాబుల్లోకి మార్చారు. ప్రస్తుతం నిత్యావసరాలకు సంబంధించిన చాలా వస్తువులు 5 శాతం శ్లాబులోనే ఉన్నాయి. జిఎస్‌టి వసూళ్లలో దాదాపు 5శాతం ఆదాయం ఈ శ్లాబు ద్వారానే వస్తోంది. అయితే పన్ను తగ్గింపు కారణంగా ఇటీవల జిఎస్‌టి వసూళ్లు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో రెవెన్యూను పెంచుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నెల 18న జరిగే జిఎస్‌టి ప్యానల్ సమావేశంలో వసూళ్లను పెంచుకునేందుకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జిఎస్‌టి శ్లాబు రేటు పెంపు చర్చకు వచ్చే అవకాశముంది. ప్రస్తుతమున్న 5శాతం శ్లాబును 6శాతానికి పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇలా పెంచితే ప్రభుత్వానికి నెలకు రూ. 1000 కోట్ల అదనపు ఆదాయం రానుంది. గత కొన్ని నెలలుగా తగ్గుతూ వస్తున్న జిఎస్‌టి వసూళ్లు నవంబరులో మాత్రం కాస్త పెరిగాయి. గత నెలలో వసూళ్లు రూ. లక్ష కోట్లు దాటి రూ. 1.03లక్షల కోట్లుగా నమోదయిన సంగతి తెలిసిందే.
ఖజానాకు తగ్గుతోన్న ఆదాయం
కేంద్రంలోని మోడీ సర్కారు పూర్తిస్థాయి కసరత్తు చేయకుండానే అమలులోకి తెచ్చిన వస్తుసేవల పన్ను (జిఎస్‌టి) విధానం వల్ల పలు ఆర్థిక వ్యవస్థకు పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిఎస్‌టి విధానంలో లోపాల కారణంగా వ్యాపారస్తుల పన్ను ఎగవేతలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఖజానాకు ఆదాయం అంతకంతకు తగ్గిపోతోంది. ఫలితంగా ఇటు కేంద్ర ప్రభుత్వం.. అటు రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన పన్ను ఆదాయం చేతికి అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. జిఎస్‌టిని అమలు చేసే సమయంలో.. కొత్త పన్ను విధానం వల్ల ఆయా రాష్ట్రాల ఆదాయానికి ఏర్పడుతున్న లోటును భర్తీ చేసేందుకుగాను తాము స్టేట్స్‌కు రానున్న ఐదేండ్ల పాటు జిఎస్‌టి పరిహారం చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చింది. కేంద్ర మాటలను నమ్మి అప్పట్లో చాలా రాష్ట్రాలు జిఎస్‌టి విధానానికి సమ్మతి తెలిపారు. అయితే ఇప్పుడు జిఎస్‌టి విధానం లోపభూయిష్టంగా మారడం.. మందగమనం కారణంగా పన్ను ఆదాయం తగ్గుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి జిఎస్‌టి పరిహారం రావడం ఆలస్యమవుతూ వస్తోంది. సరైన సమయంలో నిధులు రాక ఆయా రాష్ట్రాలలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయా రాష్ట్రాలు కేంద్రంపై గుర్రుగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ విషయామై ఆర్థిక మంత్రిని స్వయంగా నిలిదీసిన విషయం తెలిసిందే. మరికొన్ని రాష్ట్రాలైతే తమకు రావాల్సిన సొమ్ము కోసం కోర్టును కూడా ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇరకాటంలో సర్కార్..
జిఎస్‌టిని సమర్థమంతంగా అమలులో చేయడంలో విఫలమైన కేంద్రంలోని మోడీ సర్కారు ఇప్పుడు ఆదాయం తగ్గడంతో తలపట్టుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం దాదాపు రూ.6,63,343 కోట్ల మేర జిఎస్‌టి వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో తొలి ఎనిమిది నెలల కాలానికి కేంద్రం కేవలం 50 శాతం వసూళ్లను మాత్రమే సాధించగలిగింది. ప్రస్తుత సంవత్సరానికి కేంద్రం రూ.1,09,343 కోట్ల మేర జిఎస్‌టి పరిహారపు సెస్ కలెక్షన్‌ను లక్ష్యంగా చేసుకుంది. అయితే గడిచిన ఎనిమిది నెలల కాలంలో కేంద్రం కేవలం రూ.64,528 కోట్ల సెస్‌ను మాత్రమే వసూలు చేయగలిగింది. ఈ మొత్తం రాష్ట్రాలకు కేంద్ర చెల్లిస్తామని ఒప్పుకున్న పరిహారానికి ఏ మాత్రం సరిపోవు. దీంతో కేంద్రంలోని మోడీ సర్కారు ఇరకాటంలో పడింది. ఇతర వనరుల నుంచి నిధులను మళ్లిద్దామంటే ఇప్పటికే ద్రవ్యలోటు లక్ష్యాన్ని దాటి పెరిగిపోవడంతో కేంద్రం భవిష్యత్తులో ఎలా ముందుకు సాగాలో తెలియక తలపట్టుకుంటోంది. పంజాబ్‌తో సహా కొన్ని రాష్ట్రాలు తమ జిఎస్‌టి పరిహారం బకాయిల విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్టుగా హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కేంద్రం పన్ను ఆదాయం పెంచుకొనేందుకు గల అవకాశాలను తెలియజేయాల్సిందిగా రాష్ట్రాలను కోరడం గమనార్హం

0 Response to "ఇక పన్నుల మోత"
Post a Comment