ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. బస్సు ఛార్జీల పెంపు నిర్ణయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదముద్ర వేసినట్లు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించాలంటే ఛార్జీల పెంపు తప్పదని స్పష్టం చేశారు. పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలోమీటరుకు 10 పైసలు, మిగతా బస్సుల్లో కిలోమీటరకు 20 పైసలు చొప్పున బస్సు ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఛార్జీల పెంపు అమలు తేదీని రేపు లేదా ఎల్లుండి ఆర్టీసీ ఎండీ ప్రకటిస్తారని మంత్రి తెలిపారు. ఆర్టీసీని బతికించాలన్నదే ఛార్జీల పెంపు ఉద్దేశమని స్పష్టం చేశారు
ఇప్పటికే ఆర్టీసీ రూ.6,500 కోట్ల నష్టాల్లో ఉందని, ఛార్జీలు పెంచకపోతే సంస్థ దివాళాతీసే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు
ఏవో పధకాలు అని డబ్బు ఖర్చు పెట్టక పోతే ,RTC అందరికి ఉపయోగ పడేది కధ ..నష్టాన్ని governament పూడ్చి జనాల మీద భారం వేయకుండా ఉంటే అందరికి బాగుంటుంది..జై జనసేన
ReplyDelete