ఏపీ నిట్‌లో పరిశోధన కేంద్రాలు
- సెంటర్స్ ఫర్ ఎక్స్‌లెన్సీలో ఏర్పాటుకు సన్నాహాలు
- కేంద్ర మానవ వనరుల శాఖకు ప్రతిపాదనలు
- ఒక్కో కేంద్రానికి 25కోట్ల చొప్పున విడుదలకు చాన్స్
- వచ్చే ఏడాది నుంచి 10 సబ్జెక్టుల్లో ఎంటెక్ కోర్సులు
తాడేపల్లిగూడెం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి):
ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో నవశకం
ప్రారంభం కానుంది. ఇప్పటి వరకూ బోధన, అధ్యయనాలకే పరిమితమైన నిట్‌లో పరిశోధన
కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. సెంటర్స్ ఫర్ ఎక్స్‌లెన్సీలో వీటి
ఏర్పాటుకు కేంద్ర మానవ వనరుల శాఖ సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఐదు
పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు నిట్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఒక్కో
కేంద్రానికి రూ.25కోట్ల మేర నిధులు విడుదల కానున్నాయి. డేటా వేర్‌హౌసింగ్,
నానో టెక్నాలజీస్, త్రీడీ ప్రింటింగ్, హైవోల్టేజ్ ఇంజనీరింగ్,
అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ రంగాల్లో పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు
చేస్తున్నారు. అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ పరిశోధన కేంద్రంలోనే కెమికల్,
బయోటెక్నాలజీ సహా అన్ని బ్రాంచ్‌లకు సంబంధించి పరిశోధనలు నిర్వహించే
కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఇందుకు కేంద్ర అనుమతి కావాలి.
ఏపీనిట్‌కు ప్రత్యేక స్థానం
ఏపీనిట్‌కు
ప్రత్యేక స్థానం ఉంది. తొలి ఏడాదిలోనే 486సీట్లతో ప్రారంభమై నాలుగేళ్లలోనే
సొంత క్యాంపస్ సిద్ధం చేసుకుంది. తొలిబ్యాచ్ విద్యార్థుల్లో 70శాతం మంది
క్యాంపస్ సెలక్షన్లలో ఉద్యోగాలు పొందారు. మొత్తం 220మంది ఉద్యోగాలతో
బయటకు వెళ్లారు. రెండోబ్యాచ్ ఇప్పుడు బీటెక్ నాలుగో సంవత్సరానికి
చేరింది. ప్రభుత్వ రంగ సంస్థ బ్రహ్మోస్ సహా లెక్కకు మిక్కిలి పరిశ్రమలు
అప్పుడే క్యూ కడుతున్నాయి. మొదటి సెమిస్టర్‌లోనే 83మంది క్యాంపస్
సెలక్షన్‌లో ఎంపికయ్యారు. గరిష్ఠంగా రూ.14లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు
లభించాయి.
ఫేజ్-1సీకి సిద్ధం
176
ఎకరాల్లో ఏపీనిట్ శాశ్వత క్యాంపస్ సిద్ధమైంది. ఫేజ్-1ఏలో హాస్టల్,
అకడమిక్ భవనాలు పూర్తవడంతో విద్యార్థులందరినీ తాత్కాలిక క్యాంపస్ నుంచి
సొంతగూటికి తరలించారు. ఫేజ్-1బీలో రూ.196కోట్లతో కేంద్రీయ గ్రంథాలయం,
అకడమిక్ భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఫేజ్-1సీలో రూ.256కోట్లు
కేటాయించేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతారు. వీటిలో మరో 6లక్షల చ.అ.
నిర్మాణాలు చేపడితే ఏపీనిట్‌కు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చవచ్చని
డైరెక్టర్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి 10 సబ్జెక్టుల్లో ఎంటెక్ కోర్సులు
రానున్నాయి
0 Response to " ఏపీ నిట్‌లో పరిశోధన కేంద్రాలు"
Post a Comment