ఏపీకి మూడు రాజధానులు! : సీఎం జగన్
అమరావతి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని ముఖ్యమంత్రి
జగన్ శాసనసభలో ప్రకటించారు. రాజధాని అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ
అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కారాదని, వికేంద్రీకరణ జరగాలని
పేర్కొన్నారు. సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని తెలియజేసిన జగన్..
ఏపీకి బహుశా మూడు రాజధానులు రావచ్చునని అన్నారు. రాజధానిపై ఏర్పాటు చేసిన
నిపుణుల కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని సభకు తెలిపారు. అమరావతిలో
లెజిస్లేటివ్ క్యాపిటల్.. కర్నూలులో హైకోర్టు, జ్యూడిషియల్ క్యాపిటల్..
విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ పెట్టొచ్చని సీఎం జగన్
రాజధాని అంశంపై మంగళవారం
నాడు శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. ఆర్థిక మంత్రి బుగ్గన పలు కీలక
అంశాలను ప్రస్తావించారు. భూముల కొనుగోళ్లకు సంబంధించి టీడీపీ నేతలు పలు
అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దాంతో టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం
చేశారు. వారి ఆందోళన సభాకార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నందున సభ నుంచి
సస్పెండ్ చేయాలని సీఎం జగన్ కోరడంతో ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను స్పీకర్
సస్పెండ్
0 Response to " ఏపీకి మూడు రాజధానులు! : సీఎం జగన్"
Post a Comment