ఏపీలో కొత్త ప్రభుత్వ శాఖ ఏర్పాటు


అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో శాఖను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 'నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం' పేరిట కొత్త పాలనశాఖ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం 



రిజర్వేషన్ల అంశంతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అంశాలను ఈ శాఖ పర్యవేక్షించనుంది. గతంలో ఇదే పేరుతో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఆవిష్కరణల విభాగాన్ని కొత్త ప్రభుత్వ శాఖలో విలీనం చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ విభాగానికి రాష్ట్రస్థాయిలో ఒక కార్యదర్శి, అదనపు కార్యదర్శితో పాటు ఇతర సిబ్బందిని కేటాయించారు

రాష్ట్ర ప్రభుత్వంలో 37వ శాఖగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం ఉండనుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో కొత్త ప్రభుత్వ శాఖ ఏర్పాటు"

Post a Comment