విద్యార్థులు తినే అన్నమే టీచర్లకు కూడా

  • ఆహార నాణ్యత కోసం సంక్షేమ గురుకులాల్లో సరికొత్త ప్రయోగం
అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యతపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై ఆయా విద్యాలయాల్లో పనిచేసే టీచర్లకు విద్యార్థులు తినే అన్నాన్నే వడ్డించనున్నారు. గురుకుల సొసైటీ నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ‘అన్నపూర్ణ’ యాప్‌ తదితర చర్యలు తీసుకున్నా.. గురుకుల విద్యార్థులకు మూడు పూటలా నాణ్యమైన ఆహారం అందడం లేదని అధికారులు గుర్తించారు. స్టడీ అవర్‌లో ఉన్న టీచర్లు కూడా విద్యార్థులతో కలిసి ఉదయం టిఫిన్‌, రాత్రి భోజనం చేయాలని కమిటీ సభ్యులు సూచించారు. వీటిని ఫొటోలుగా తీసుకుని ‘అన్నపూర్ణ వెబ్‌పోర్టల్‌’లో విధిగా అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఈ విధానాన్ని కచ్చితంగా పాటించేలా సొసైటీ బోర్డు మెంబర్లు సెక్రటరీ రాములుకు పూర్తి అధికారాలు కల్పించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విద్యార్థులు తినే అన్నమే టీచర్లకు కూడా"

Post a Comment