త్వరలో కొత్త జాతీయ విద్యా విధానం
దిల్లీ: త్వరలో కొత్త జాతీయ విద్యా విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి రానుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి (ఉన్నత విద్య) ఆర్.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆ విద్యా విధానం ప్రపంచంలో భారత్ కీర్తిని మరింత ఇనుమడింపజేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర మానవరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్‌తో కలిసి ఏఐసీటీఈలో 2019 సంవత్సరానికి స్వచ్ఛ క్యాంపస్ ర్యాంకింగ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు. ''కొత్త జాతీయ విద్యా విధానం రూపకల్పన చివరి దశలోనే ఉంది. త్వరలోనే అది మీ ముందుకు రాబోతుంది. ఈ కొత్త విద్యా విధానం మన విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు నాంది కాబోతుంది'' అని సుబ్రహ్మణ్యం అన్నారు
0 Response to "త్వరలో కొత్త జాతీయ విద్యా విధానం"
Post a Comment