వాట్సప్‌లో కాల్‌ వెయిటింగ్‌ ఫీచర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్‌ వచ్చింది. ఇప్పటి వరకు వాట్సప్‌ కాల్‌లో మనం ఎవరితోనైనా సంభాషిస్తున్నప్పుడు ఇతరులెవరైనా వాట్సప్‌ కాల్‌ చేస్తే అవతలి కాల్‌ ఆటోమేటిక్‌గా కట్‌ అయిపోయేది. దీంతో కాల్‌ పూర్తయితే గానీ ఎవరు కాల్‌ చేశారో తెలుసుకోవడం కష్టమయ్యేది. ఇకపై ఆ ఇబ్బందులుండవు. వాట్సప్‌ కొత్తగా కాల్‌ వెయిటింగ్‌ ఫీచర్‌ను తన ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు తీసుకొచ్చింది. ఇప్పటికే వాట్సప్‌ ఐవోఎస్‌ వినియోగదారులకు ఈ ఫీచర్‌ గత నెలే అందుబాటులోకి వచ్చింది.

కొత్త ఫీచర్‌ ప్రకారం.. ఎవరైనా వాట్సప్‌ కాల్‌ చేస్తే వారికి కాల్‌ వెయిటింగ్‌ అలెర్ట్‌ వస్తుంది. ఆ విషయం సంభాషిస్తున్న మనకూ తెలుస్తుంది



దీంతో అవతలి కాల్‌ను మనం అప్పుడే లిఫ్ట్‌ చేసి మాట్లాడొచ్చు. అయితే, కాల్‌ను హోల్డ్‌లో పెట్టే సదుపాయం మాత్రం ఇందులో లేదు. సాధారణ కాల్స్‌ విషయంలో వెయిటింగ్‌ కాల్‌ వచ్చినప్పుడు అవతలి వ్యక్తిని హోల్డ్‌లో ఉంచి మనం సంభాషించే వెసులుబాటు ఉంది. వాట్సప్‌ కాల్‌ వెయిటింగ్‌ కాల్‌ ఫీచర్‌ ప్రస్తుతం అందరికీ తీసుకొచ్చింది. వాట్సప్‌ వెర్షన్‌ 2.19.352 వాడుతున్న వినియోగదారులు, 2.19.357, 2.19.358 బీటా వెర్షన్లు వాడుతున్న ఆండ్రాయిడ్‌ వినియోగదారులు ఈ ఫీచర్‌ను పొందొచ్చు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వాట్సప్‌లో కాల్‌ వెయిటింగ్‌ ఫీచర్‌"

Post a Comment