పాఠశాలల్లో ఎనర్జీ క్షబ్‌లు

పాఠశాలల్లో ఎనర్జీ క్షబ్‌లు

 ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక చర్యలు

14 నుంచి ఇంధన సంరక్షణ వారోత్సవాలు

కలెక్టర్లకు సీఎస్‌ ప్రత్యేక ఆదేశాలు
ఆంధ్రభూమి బ్యూరో అమరావతి, డిసెంబర్‌ 8: ఇంధన పరిరక్షణపై రాష్ట్రవ్యా ప్తంగా స్పెషల్‌ డైవ్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇందులో అన్ని జిల్లాల పాలనా యంత్రాంగాలను భాగస్వాములు చేస్తూ ప్రజల్లో ఇంధన పరిరక్షణపై అవగా హన పెంపొందించే దిశగా కార్యాచరణ చేపట్టాలని భావి స్తోంది. ఈవిషయమై జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయి నుంచి ప్రత్యేక దృష్టి పెట్టటం ద్వారా ఇంధన పరిరక్షణ స్పెషల్‌ డైవ్‌ను విజయవం తంగా నిర్వహించాలని సూచించారు. ఇంధన పరిరక్ష ణలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర విద్యుత్‌ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 14నుంచి 20వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంధన పరిరక్షణ వారోత్సవా లను నిర్వహించాలని కోరుతూ

ఉద్యమంలా ఇంధన పొదుపు

నిధులు మంజూరు చేసింది. దీనిపై ప్రత్యేకంగా ప్రభుత్వానికి లేఖ అందింది.
ఈసందర్భంగా రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌ చైర్మన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
నీలం సాహ్ని ఇంధన శాఖ అధికారులతో మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ శాఖ ఇంధన
పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. క్షేత్రస్థాయి నుండి
ఉన్నత స్థాయి వరకు అధికారులు ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించాలని, ప్రజలకు ప్రేర
ణగా నిలవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఇంధన పొదుపు ఉద్యమాన్ని నిర్మించాల్సిన
అవసరం ఎంతైనా ఉందన్నారు. అత్యంత నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్‌ను అందు
బాటు ధరల్లోనే అందించాలని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయ సాధ
నకు ఇంధన పొదుపు, సామర్ధ్యం పెంపు వంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలి
పారు. దీనివల్ల ప్రతి విద్యుత్‌ వినియోగదారునికి మేలు జరుగుతుందన్నారు. స్టానిక
సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా విద్యుత్‌ బిల్లులు ఆదా అవుతాయన్నారు.
ఇదిలావుంటే, రాష్ట్రంలోని పాఠశాలల్లో ఎనర్జీ క్లబ్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేప
ట్టాలని సీఎస్‌ సాహ్ని అధికారులను ఆదేశించారు.

విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే ఇంధన పొదుపుపై అవగాహన కల్పించటంతో పాటు ఇంధన పరిరక్షణ వారి జీవన్దోలిలో భాగంగా మార్చుకునే కార్యక్రమాలను రూపొందిం చాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేం దుకు ఇది ఉపకరిస్తుందని చెప్పారు. రాష్ట్రలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు అమ లుచేయడం ద్వారా పరిశ్రమలు, వ్యవసాయం, స్టానిక సంస్థలు, గృహ వినియోగ రంగాల్లో 20నుంచి 25శాతం విద్యుత్‌ ఆదా చేసేందుకు అవకాశం ఉందని ఇంధన శాఖ అధికారులు సీఎస్‌కు వివరించారు. కేంద్ర సంస్థ ఈఈఎస్‌ఎల్‌ సహకారంతో పంచాయ తీరాజ్‌ శాఖ అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ అమర్చే కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి వీధిలైట్ల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ కనబ రుస్తున్నారని తెలిపారు. కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లోని గ్రామీణ నీటి సరఫరా పథకం పంపుసుట్ల స్థానంలో ఇంధన సామర్ధ్య పంపుసెట్లు ఏర్పాటు చేసినట్లు గుర్తుచే శారు. ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఎనర్జీ ఆడిట్‌ నిర్వహించేందుకు బీఈఈ నిధులు మంజూరు చేసిందని తెలిపారు. మిగిలిన 10 జిల్లాల్లో అమలు చేసేందుకు ఎనర్జీ ఆడిట్‌ నిర్వహించటానికి కూడా బీఈఈ నిధులు విడుదల చేసిందని వివరిం చారు. తొలిదశలో రాష్ట్రంలోని లక్ష వ్యవసాయ పంపుసెట్ల స్థానంలో ఇంధన సామర్ధ్య పంపుసెట్లను అమర్చే కీలకమైన కార్యక్రమాన్ని విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) అమలు చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే దాదాపు 6,016 ఇంధన సామర్ధ్య పంపుసెట్ల ఏర్పాటు పూర్తయిందని, ఈ పథకం ద్వారా 124 మిలియన్‌ యూనిట్లు పొదుపు చేసే అవకాశ ౦ ఉందన్నారే.. | నుంచి వారో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ మాట్లాడుతూ ఇంధన పరిరక్షణ వారోత్సవాలు నిర్వహించేందుకు బీఈఈ అందించే నిధులను ౦లకు పంపామని, జిల్లాల్లో కలెక్టర్లు, రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌ (ఎస్‌ఈసీఎం)తో సమ న్వయం చేసుకుని ఆయా జిల్లాల ఎస్‌ఈలు ఈ నెల 14 నుంచి 20వరకు కార్యక్రమా లను విజయవంతంగా నిర్వహిస్తారని వివరించారు. ఈసందర్భంగా సీఎస్‌ సాహ్ని మాట్లాడుతూ అత్యంత విలువైన ఇంధన వనరుల సంరక్షణలో భాగంగా అమలుచేసే పొదుపు కార్యక్రమం అత్యంత ప్రాముఖ్యమైందన్నారు. దీన్ని ఓ జీవన్దైలిగా మార్చు కోవాల్సిన అవసరం ఉద్యోగులతో పాటు సమాజంలో ప్రతిఒక్కరపై ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆయా శాఖలు, సంస్థలు అత్యంత కీలకమైన ఇంధన, నీటి పొదుపు అంశాలను ఆచరిస్తే ప్రజలు ఎలా భాగస్వామ్యం వహించాలో వివరిస్తామ న్నారు. ముందు ప్రభుత్వ యంత్రాంగం వీటిని ఆచరించి సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు సైతం ఇది ఉపకరిస్తుందన్నారు




SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాఠశాలల్లో ఎనర్జీ క్షబ్‌లు"

Post a Comment