బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్: ఇక పై 24 గంటలు అందుబాటులో ఆ సేవలు
ముంబై: నెట్ బ్యాంకింగ్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు పరిమిత సమయం వరకు ఉండే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) డిసెంబర్ 16 నుంచి ఏడు రోజుల పాటు 24 గంటలు అందుబాటులో ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 15 రాత్రి తర్వాత తెల్లారితే అంటే డిసెంబర్ 16 నుంచి NEFT సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. అయితే తొలి లావాదేవీలు మాత్రం అర్థరాత్రి 12:30 గంటలకు జరుగుతుందని చెప్పింది.
ఇదిలా ఉంటే సేవింగ్స్ ఖాతాలు కలిగి ఉన్నవారు NEFT వినియోగించి లావాదేవీలు జరిపితే ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదని ఇప్పటికే బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది
ఇక ఆర్బీఐ పరిధిలోకి వచ్చే ఆయా బ్యాంకులకు కొన్ని సూచనలు చేసింది ఆర్బీఐ. ప్రతి 48 గంటలకు ఒక బ్యాచ్ లావాదేవీలు జరుగుతాయని పేర్కొంది. అర్థరాత్రి 12:30 గంటలకు తొలి బ్యాచ్ సెటిల్‌మెంట్ జరుగుతుందని వెల్లడించింది . ఇలా తిరిగి మళ్లీ అర్థరాత్రి 12 గంటలకు లావదేవీలు ముగుస్తాయని పేర్కొంది. ఇక NEFT విధానం అన్ని రోజులు అందుబాటులో ఉంటుందని బ్యాంకు సెలవుదినాల్లో కూడా ఈ వ్యవస్థ పనిచేస్తుందని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది.బ్యాంకు సమయం ముగిసిన తర్వాత జరిగే లావాదేవీలు స్ట్రెయిట్ త్రూ ప్రాసెసింగ్ విధానం ద్వారా జరుగుతాయని ఆర్బీఐ పేర్కొంది. NEFT ద్వారా జరిగిన లావాదేవీలకు సంబంధించి ఒక కన్ఫర్మేషన్ మెసేజ్‌వస్తుందని ఆర్బీఐ వెల్లడించింది.
ఇక సూచనలను పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టం యాక్ట్ 2007లోని సెక్షన్ 10(2) కింద చేర్చడం జరిగిందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ పరిధి కిందకు వచ్చే బ్యాంకులన్నీ NEFT లావాదేవీల కోసం సరిపడా డబ్బులను ఆర్బీఐ వద్ద ఉంచాలని ఆదేశించింది. ఇక ఆయా బ్యాంకులు తమ కస్టమర్లకు NEFT విధానంపై అవగాహన కల్పించాలని రిజర్వ్ బ్యాంక్ కోరింది
0 Response to "బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్: ఇక పై 24 గంటలు అందుబాటులో ఆ సేవలు"
Post a Comment