గ్రామ పంచాయితి ఎన్నికలు-2019 కరదీపిక

అధ్యాయం-!


1. పరిచయము:-

గ్రామ పంచాయతీ సభ్యుడు లేదా సర్పంచు ఎన్నిక కొరకు మీరు అభ్యర్థి అయితే, మీ అభ్యర్థిత్వానికి
సంబంధించి మీరు ఎటువంటి ఇబ్బంది లేక అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు, ఎన్నికలకు సంబంధించిన
చట్టపరమైన విషయాలపై అవగాహన అవసరం. ఈ క్రమంలో జారీ కాబడిన ముఖ్యమైన చట్ట నిబంధనలు, నియమాలు,
ఆదేశాలు, సూచనలను సంక్షిప్తంగా తెలియజేస్తూ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ కరదీపికను విడుదల
చేసింది. ఏదైనా సందేహం ఉత్పన్నమైనప్పుడు ఈ కరదీపిక ఉపయోగపడుతుంది. అయితే చట్టం, నిబంధన,
ఆదేశాలకు ఈ కరదీపిక ప్రత్యామ్నాయం కాదని భావించగలరు.

2. పదవి కాలపరిమితి:-

సాధారణ ఎన్నికల్లో ఎన్నికయిన గ్రామ పంచాయతీ సభ్యులు మరియు సర్పంచులకు, ఎన్నికల తరువాత
గ్రామ పంచాయతీ మొదటి సమావేశానికి నిర్ణయించిన తేదీ నుండి ఐదు సంవత్సరాల కాలం పాటు పదవీ కాలపరిమితి
ఉంటుంది.

3. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, వెనుకబడిన తరగతుల మరియు మహిళల కోసం రిజర్వేషన్లు:-

ప్రతి సాధారణ ఎన్నికలకు ముందు జిల్లా గెజిటులో ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి. మరియు మహిళల కోసం రిజర్వు
చేసిన గ్రామ పంచాయతీ సర్పంచు, వార్డు సభ్యుల నియోజకవర్గ వివరాలను ప్రకటించడమవుతుంది. ప్రతి గ్రామ
పంచాయతీకి నియమించిన రిటర్నింగు అధికారి జారీ చేసిన ఎన్నికల నోటీసులో కూడా ఈ సమాచారాన్ని
తెలియజేయడం జరుగుతుంది. రిజర్వేషన్లను ఖరారు చేసే ప్రక్రియ చట్టం ప్రకారం ప్రభుత్వ పరిధిలో ఉంటుంది.

4.నమోదయిన ఓటర్లు:-

గ్రామ పంచాయతీ సభ్యుల మరియు సర్పంచ్‌ పదవులకు ఎన్నికలు వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన
జరుగుతున్నాయి. పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి, గ్రామ పంచాయతీ ఎన్నికల జాబితాలో ఓటరుగా నమోదయిన
ప్రతి వ్యక్తి ఓటు వేయడానికి అర్హుడు.

5. ఫోటో ఓటరు జాబితా, ఓటరు ఫోటో గుర్తింపు కార్డులు:-

గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా 1994-ఆంధ్ర ప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ చట్టంలోని 11వ విభాగం, 2000-
ఆంధ్ర ప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ చట్టపు (ఓటరు జాబితా రూపకల్పన, ప్రచురణ) నిబంధనలను అనుసరించి తాజా
అసెంబ్లీ నియోజక వర్గ ఓటర్ల జాబితాను ప్రామాణికంగా చేసుకొని, గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను జిల్లా
పంచాయతీ అధికారి రూపొందించి, ప్రచురించడము జరుగుతుంది.

గ్రామ పంచాయతీ ఓటరు జాబితాలో ఏదైనా పేరు ఇతర వివరాల నమోదుపై ఎవరికైనా ఏదైనా ఆక్షేపణ లేదా
అభ్యంతరమున్న యెడల లేదా అర్హుడైన వ్యక్తి తన పేరు నమోదు చేసుకొనుటకు క్లయిము దాఖలు చేయాలని



CLICK HERE TO DOWNLOAD
ఆశించినట్లయితే, ముందుగా 1950-ప్రజా ప్రాతినిధ్య చట్టం క్రింద జారీకాబడిన 1960-ఓటరు నమోదు నియమాల
ప్రకారము సహేతుకమైన ఆక్షేపణ లేదా క్లెయిమును సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు రిజిస్టేషను అధికారి
(౬70) వద్ద గాని సహాయ ఓటరు రిజిస్టేషను అధికారి (4౯౧౦) వద్ద గాని దాఖలు చేసి అట్టి క్లెైయిము, లేదా ఆక్షేపణ

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "గ్రామ పంచాయితి ఎన్నికలు-2019 కరదీపిక"

Post a Comment