జనవరిలో 'స్థానిక' ఎన్నికలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:
స్థానిక సంస్థల ఎన్నికలను జనవరి చివరలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం అమ్మఒడి పథకాన్ని కూడా ముందుగానే ప్రారంభించనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాట్లా డుతూ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించిన తరువాతే, స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో గతంలో ప్రకటించిన విధంగా జనవరి 26న కాకుండా, ఆ నెల 9వ తేదినే పథకాన్ని ప్రారంభించా లని మంత్రిమండలి అభిప్రాయపడింది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని అధికారయంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిసింది


జనవరి 9న అమ్మఒడి పథకాన్ని ప్రారంభించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలన ఈ సమావేశంలో నిర్ణయించారు. అదేవిధంగా మార్కెటింగ్‌, దేవదాయ పాలకమండళ్ల నియామకం, ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా ఉద్యోగాల భర్తీ నవంబర్‌లోపు పూర్తి చేయాలని జిల్లా ఇన్‌చార్జ్‌మంత్రులను సిఎం ఆదేశించిన్నట్లు సమాచారం. ఈ మూడింటిల్లోనూ 50శాతం రిజర్వేషన్ల నిబంధన కచ్చితంగా అమలు చేయాలని, ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లాల్లో రెండు రోజులు ఉండాలని మంత్రులను ఆదేశిం చిన్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ బాధ్యతలను మంత్రులకు అప్పగించాలన్న సూచనను సిఎం తిరస్కరించి నట్లు సమాచారం.

పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుపై వస్తున్న వ్యతిరేకతపై చర్చ జరిగింది. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, స్వర్ణభారతి ట్రస్టు, ఎన్టీఆర్‌ ట్రస్టులలో కూడా ఆంగ్లం మాధ్యమంలోనే బోధిస్తున్నారని సిఎం అన్నట్లు తెలిసింది. దశల వారీగా ఇంగ్లం అమలు చేస్తున్నామని, ఒకేసారి కాదని చెప్పిన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గురువారం దీక్ష చేపట్టిన విషయాన్ని సమా వేశంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రస్తావించినట్లు తెలిసింది. బాబు దీక్షకు వ్యతిరేకంగా ఎదురుడాడికి దిగాలని మంత్రులకు సిఎం చెప్పిన్నట్లు తెలిసింది. గురువారం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చంద్రబాబు హయాంలో జరిగిన ఇసుక మాఫీయాపై వివరించాలని మంత్రులకు దిశా నిర్దేశం చేసిన్నట్లు సమాచారం

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జనవరిలో 'స్థానిక' ఎన్నికలు"

Post a Comment