పది నిమిషాల్లో విద్యుత్‌ కారుకు ఛార్జింగ్‌!

వాషింగ్టన్‌: పది నిమిషాల ఛార్జింగ్‌తో ఏకంగా 200 మైళ్ల పాటు విద్యుత్‌ వాహనాన్ని నడిపించే సరికొత్త బ్యాటరీ డిజైన్‌ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. విద్యుత్‌ వాహనాలను వేధిస్తున్న కీలక సమస్యను ఇది పరిష్కరిస్తుందని వారు తెలిపారు.




విద్యుత్‌ వాహనాలకు సంబంధించి వేగంగా ఛార్జింగ్‌ అనేది చాలా కీలకాంశం. పెట్రోలు, డీజిల్‌తో నడిచే వాహనాలతో పోటీపడాలంటే ఇది చాలా అవసరం. టెస్లా కంపెనీ ఉత్పత్తి చేస్తున్న కొత్త తరం విద్యుత్‌ కార్లకు పాక్షికంగా ఛార్జి కావడానికి కూడా అరగంట పడుతోంది. ఈ నేపథ్యంలో పది నిమిషాలు ఛార్జి చేస్తే 200 మైళ్లు పయనించే వాహనంపై అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దృష్టిసారించారు


అయితే ఇంత వేగంగా ఛార్జి చేయాలంటే అంత సమయంలో 400 కిలోవాట్ల మేర శక్తిని గ్రహించాల్సి ఉంటుంది. ప్రస్తుత బ్యాటరీలకు ఈ సామర్థ్యం లేదు. ఈ ఇబ్బందిని అధిగమించడానికి శాస్త్రవేత్తలు ఛార్జింగ్‌ సమయంలో తమ ప్రయోగాత్మక బ్యాటరీలో ఉష్ణోగ్రతను 60 డిగ్రీల సెల్సియస్‌కు పెంచారు. అనంతరం ఈ శక్తిని వినియోగించే సమయంలో ఆ వేడిని తగ్గించారు. వేగంగా ఛార్జి చేసే సమయంలో తలెత్తే ఉష్ణోగ్రత వల్ల ఎక్కువ నష్టం జరగకుండా ఈ విధానం 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పది నిమిషాల్లో విద్యుత్‌ కారుకు ఛార్జింగ్‌!"

Post a Comment