ఆర్టీసీ కార్మికులకు ఛాన్స్ ఇస్తున్నాం: కేసీఆర్
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు చెప్పారు. వారికి ఛాన్స్ ఇస్తున్నామని.. రేపు ఉదయం అందరూ విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. విధుల్లో చేరేందుకు ఎలాంటి షరతులు విధించడం లేవని చెప్పారు. యూనియన్ల కారణంగానే అసంబద్ధ డిమాండ్లతో కార్మికులు ఆర్టీసీ సమ్మెకు దిగారని సీఎం కేసీఆర్ అన్నారు. దీంతో వారు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. విపక్షాల మాటలు నమ్మొద్దని.. విధుల్లో చేరాలని తాను స్వయంగా విజ్ఞప్తి
చేశానని ఆయన గుర్తు చేశారు. ప్రగతి భవన్‌లో మీడియాతో కేసీఆర్ మాట్లాడారు. ఆర్టీసీ సమ్మెకు పూర్తి బాధ్యత యూనియన్లదే అని ఆయన స్పష్టం చేశారు. భాజపా, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం
అని ప్రశ్నించారు. విపక్ష పార్టీలు లేని ఆశలను కార్మికుల్లో కల్పించాయని మండిపడ్డారు
0 Response to "ఆర్టీసీ కార్మికులకు ఛాన్స్ ఇస్తున్నాం: కేసీఆర్"
Post a Comment