నిద్ర పట్టట్లేదా?

శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక వ్యక్తి రోజులో కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతే ఎన్నో రకాల అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు. * శారీరక శ్రమకు దూరంగా ఉండేవారికి గాఢనిద్ర వచ్చే అవకాశాలు తక్కువ. రోజూ కనీసం అరగంట నడక, వ్యాయామాలు, ఆసనాలు వంటివి ప్రయత్నిస్తే శరీరం అలసిపోతుంది. ఆటంకం లేకుండా నిద్రపడుతుంది. * కాఫీ, టీలలో ఉండే కెఫీన్‌తోనూ నిద్ర సరిగా పట్టకపోవచ్చు. వీటిని మితంగా తీసుకోవాలి. రాత్రి భోజనం తరువాత టీ, కాఫీలకు దూరంగా ఉండటం మంచిది. * టీవీలు, ఫోన్లు, కంప్యూటర్‌ తెరలు విడుదల చేసే నీలిరంగు కాంతి మెదడుపై ప్రభావం చూపిస్తుంది
దీంతో ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు. పడుకోవడానికి గంట ముందే వీటికి దూరంగా ఉండాలి. * నిద్ర వేళలు రోజూ ఒకేలా ఉండేలా చూసుకోవాలి. పడుకోవడానికి గంట ముందు గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే...



కాసేపటికే నిద్రపడుతుంది. * నిద్రలేమితో బాధపడేవారు రాత్రివేళ ఏదో ఒక పుస్తకం చదవడం అలవాటు చేసుకుంటే మార్పు కనిపించొచ్చు. మధ్యాహ్నం కునుకు తీయడమూ మానేయాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నిద్ర పట్టట్లేదా?"

Post a Comment