ఫ్రీ ఇంటర్నెట్.. రోజుకు గంటపాటు సూపర్‌ఫాస్ట్ నెట్.
ఇది స్మార్ట్‌ఫోన్ల కాలం.. ప్రతీ చేతిలో స్మార్ట్‌ఫోన్.. సోషల్ మీడియాలో చెలరేగిపోవడం.. ఇక, ప్రభుత్వాలు కూడా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను దృష్టికి పెట్టుకుని పథకాలు తీసుకు వస్తున్నాయి. ఇదే సమయంలో ఐటీ క్యాపిటల్ అయిన బెంగళూరు వాసులకు గుడ్‌న్యూస్ వినిపించారు కర్ణాటక డిప్యూటీ సీఎం సీఎన్ అశ్వథానారాయణ్.. సిటీలోని పలు ప్రాంతాల్లో వైఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేస్తామని.. వీటి ద్వారా ప్రతీరోజూ గంటపాటు ఫ్రీగా సూపర్‌ఫాస్ట్ ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. ఈ సౌకర్యం రానున్న 9 నెలల పాటు అమలు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. బెంగళూరు వ్యాప్తంగా 4 వేల హాట్‌స్పాట్లు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది
వివరాలు నమోదు చేసుకుని.. ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో.. రోజుకు 1 జీబీ డేటా వరకు ఉపయోగించుకునే వీలు కల్పిస్తున్నారు
0 Response to "ఫ్రీ ఇంటర్నెట్.. రోజుకు గంటపాటు సూపర్‌ఫాస్ట్ నెట్."
Post a Comment