ఏపీలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ఐఏఎస్‌లు, ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు వెయిటింగ్‌లో ఉన్న ఐఏస్‌ అధికారి సతీశ్‌చంద్రకు నాలుగు నెలల తర్వాత ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. ఉన్నత విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సతీశ్‌ చంద్రకు పోస్టింగ్‌ ఇచ్చారు. జే.ఎస్‌.వి. ప్రసాద్‌ను సాధారణ పరిపాలనశాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు వాలంటీర్ల విభాగం ఇన్‌ఛార్జిగా కె.కన్నబాబు నియమించారు. ఐపీఎస్‌ అధికారి త్రిపాఠిని డీజీపీకి రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఐపీఎస్‌ అధికారి ఎన్‌.వి




సురేంద్రబాబును ఎస్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా నియమించారు. సురేంద్రబాబు ఇసుక అక్రమ తవ్వకాలు, ఎక్సైజ్‌ వ్యవహారాలు చూడనున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీ"

Post a Comment