విద్యకు 33 వేల కోట్లు
- వర్సిటీల్లో ఖాళీలు త్వరలో భర్తీ
- డిసెంబరు 26న ‘కడప ఉక్కు’ శంకుస్థాపన: సురేశ్
కడప(వైవీయూ), నవంబరు 2:
విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.33 వేల కోట్లు ప్రభుత్వం కేటాయింపు
చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
శనివారం యోగివేమన యూనివర్సిటీ(వైవీయూ) అధికారులు, అధ్యాపకులతో సర్ సీవీ
రామన్ సైన్స్ భవన్ సెమినార్ హాల్లో మంత్రి సురేశ్, డిప్యూటీ సీఎం
అంజద్‌బాషా, చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డిలతో కలిసి సమీక్ష
నిర్వహించారు.
మంత్రి సురేశ్ మాట్లాడుతూ డిసెంబరు 26న కడప ఉక్కు పరిశ్రమకు
ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేస్తారన్నారు. దీంతో కడపలోని నిరుద్యోగ
యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో
ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. గత
ప్రభుత్వం ఏపీపీఎస్సీకి నిర్వహణ బాధ్యత ఇచ్చిందని, కానీ ఈ ప్రభుత్వం
ఏపీపీఎస్సీకి ఇవ్వాలా, వద్దా అని పరిశీలిస్తోందని తెలిపారు. యూనివర్సిటీల
అటానమస్ దెబ్బతినకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రాథమిక,
మాధ్యమిక, ఉన్నత విద్యకు సంబంధించి కమిషన్ వేశామని, కరికులంలో సమూల
మార్పులు తెస్తున్నామని తెలిపారు. వర్సిటీలు జాతీయ స్థాయిలో ర్యాంకులకు
కృషి చేయాలన్నారు. ప్రతి పార్లమెంటుకు ఒక స్కిల్ డెవల్‌పమెంటు స్కూలు
ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్కిల్ డెవల్‌పమెంట్ యూనివర్సిటీని ఏర్పాటు
చేస్తామన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలను పూర్తి స్థాయిలో బలోపేతం
చేస్తామని, ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించే ప్రసక్తే లేదని చెప్పారు
0 Response to " విద్యకు 33 వేల కోట్లు"
Post a Comment