2020 గణతంత్ర వేడుకలకు అతిథి ఎవరంటే?
దిల్లీ: వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బాల్సోనారో ప్రత్యేక అతిథిగా రానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం బ్రెజిల్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు గణతంత్ర వేడుకలకు హాజరుకావడానికి బ్రెజిల్ అధ్యక్షుడు అంగీకరించినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోదీ..బాల్సోనారోను ఆహ్వానించారని తెలిపింది. భారతీయులు వీసా లేకుండా బ్రెజిల్‌కు ప్రయాణించే సౌకర్యం కల్పించడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేసినట్లు పేర్కొంది.
మరోవైపు వీరిద్దరి మధ్య జరిగిన భేటీపై విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ ట్వీట్ చేశారు.ఇద్దరి మధ్య చర్చలు ఫలవంతమైనట్లు తెలిపారు.'భారత్-బ్రెజిల్ భాగస్వామ్యం మరింత బలపడుతోంది
భారత ప్రధాని నరేంద్ర మోదీ..బ్రెజిల్ ప్రధాని జాయిర్ బాల్సోనారోతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి' అని ట్వీట్ చేశారు
0 Response to "2020 గణతంత్ర వేడుకలకు అతిథి ఎవరంటే?"
Post a Comment