సీజనల్‌ వసతి గృహాల నిర్వహణ కోసం. స్వచ్చంద సంస్థల ఎంపికకై జిల్లా ఎక్స్‌అఫిషియో ప్రాజెక్టు కో-ఆర్టినేటర్లు / అదనపు ప్రాజెక్టు కో -ఆర్టినేటర్లకు మార్గదర్శకాలు 2019-20

ఆర్‌సినెం. 4847/ఎపిఎస్‌ఎస్‌ఎ/ఓఎస్సీ/ఎ10/2015 తెది : .11.2010

సీజనల్‌ వసతి గృహాల నిర్వహణ కోసం ప్రభుత్వ విభాగాలు /
స్వయం సహాయక బృందాలు / స్వచ్చంద సంస్థల ఎంపికకై
జిల్లా ఎక్స్‌అఫిషియో ప్రాజెక్టు కో-ఆర్టినేటర్లు / అదనపు ప్రాజెక్టు కో -ఆర్టినేటర్లకు
మార్గదర్శకాలు 2019-20

2018-19 విద్యాసంవత్సరంలో బడిబబయట పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గింది. “సమగ్రశిక్షా” మన బడికిపోదాం

యాప్‌ ద్వారా జరిపిన శాస్త్రీయ సర్వేలో ఈ సంఖ్య తగ్గడం శుభసూచకం.

ల్సి

2019-20 విద్యాసంవత్సరంలో మరికొంతమంది బడిబయట పిల్లల సంఖ్యను తగ్గించేందుకు సమగగ్రశిక్షా కృషి
చేస్తోంది. ఈ విద్యాసంవత్సరానికి 26,191 మంది వలసవెళ్ళే తల్లిదండ్రుల పిల్లలను గుర్తించడం జరిగింది. ఈ
పిల్లలను సీజనల్‌ హాస్టళ్ళలో చేర్చించి చదివించే సదాశయంతో కేంద్ర మానవ వనరుల శాఖ రూ. 2169. 10
లక్షల రూపాయలు కేటాయించి 6 నెలల పాటు ఈ సీజనల్‌ హాస్టళ్ళను నిర్వహించడానికి అనుమతించింది.

జిల్లా అదనపు ప్రాజెక్టు కో-ఆర్జినేటర్లు జిల్లాలోని అన్ని ఎస్సీ/ఎస్టీ/బిసి సంక్షేమ హాస్టళ్ళు, కస్తూర్చాగాంధీ బాలికా
విద్యాలయాలలోనూ ఈ విద్యార్థులను చేర్చించే విధంగా చర్యలు చేపట్టాలి.

పైన తెలియజేసిన విధంగా వలస వెళ్ళిన / వెళ్ళబోయే తల్లిదండ్రుల పిల్లలను ఎస్సీ, ఎస్టీ/బిసి హాస్టళ్ళు, కస్తూర్చాగాంధీ
బాలికా విద్యాలయాలలో చేర్చగా మిగిలిన విద్యార్థులు లేదా ఏ రకమైన హాస్టళ్ళు లేని ప్రాంతాలలోని పిల్లలను
సీజనల్‌ హాస్టళ్ళలో చేర్చాలి.

సంబంధిత ప్రభుత్వ విభాగాల సమన్వయం మరియు స్వయం సహాయక బృందాలు/స్వచ్చంద సంస్థల ఎంపిక

ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులు అధికంగా ఉన్న ప్రదేశాలలో సీజనల్‌ హాస్టళ్ళు ప్రారంభించేందుకు జిల్లా ఎక్స్‌
అఫిషియో ప్రాజెక్టు కో-ఆర్టినేటర్‌, సంబంధిత ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి, బిసి, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులను
సంప్రదించి ఈ కేంద్రాల నిర్వహణను వారికి అప్పగిస్తూ సదరు బడ్జెటును వారికే నేరుగా కేటాయిస్తామని
తెలియజేయాలి. అప్పటికి కూడా ప్రభుత్వ విభాగాలు ఈ శిక్షణా కేంద్రాల నిర్వహణకు ముందుకు రాని పక్షంలో
మాత్రమే జిల్లా ప్రాజెక్టు కో-ఆర్జినేటర్‌ నిబద్ధత కలిగిన స్వయం సహాయక సంఘాలు మరియు సేవాభావం
కలిగిన స్వచ్ళంద సంస్థల నుండి దరఖాస్తులను ఆహ్వానించి పిదప వాటిని అత్యంత జాగరూకతతో పరిశీలించి
అర్హులైన వారిని వారి యొక్క కార్యప్రణాళిక (యాక్షన్‌ ప్లాన్‌)ను సమర్పించడానికి ఆహ్వానించాలి. ఈ విధంగా
ఎంపిక కాబడిన సంస్థలు వారి అర్హతను మరియు విద్యార్థుల ఆధార్‌ నెంబరుతో పాటు ఇతర వివరాలను రాష్ట్ర




పథక సంచాకుల వారి ఆమోదం కోసం సమర్పించాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సీజనల్‌ వసతి గృహాల నిర్వహణ కోసం. స్వచ్చంద సంస్థల ఎంపికకై జిల్లా ఎక్స్‌అఫిషియో ప్రాజెక్టు కో-ఆర్టినేటర్లు / అదనపు ప్రాజెక్టు కో -ఆర్టినేటర్లకు మార్గదర్శకాలు 2019-20 "

Post a Comment