మన పాఠ్యపుస్తకాలు ( ETBs), QR Codes తో
★ ఇపుడు మన పాఠ్యపుస్తకాలు ( ETBs), QR Codes తో ఉన్నాయి.
ప్రతి QR Code లో పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలు, వాటి వివరణ డిజిటల్ రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి.
★ వాటిని విద్యార్థులు ఆండ్రాయిడ్ మొబైల్ లో దీక్ష యాప్ ద్వారా చూడవచ్చు. పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు.
★ సెలవుల్లో విద్యార్థులు తమ వెంట పుస్తకాలు మోసుకెళ్ళలేని పరిస్థితుల్లోకూడా సులభంగా దీక్ష యాప్ ద్వారా తమ పాఠ్యాంశాలు చదువుకోవచ్చు.
★ ఉపాధ్యాయులు తమ DCR, Smart Board ద్వారా దీక్ష సైట్ ను diksha.gov.in ద్వారా బ్రౌజ్ చేసి విద్యార్థులకు డిజిటల్ పాఠాలు వివరించవచ్చు.
★ మొబైల్ లో దీక్ష యాప్ ద్వారా ఒక QR Code కు సంబంధించిన అంశాలు చూడాలంటే దీక్షయాప్ తెరచి సదరు QR Code ను స్కాన్ చేసి చూడవచ్చు.
★ దీక్షయాప్ ను ఉపయోగించడానికి అతి తక్కువ ఇంటర్నెట్ అవసరమౌతుంది. కేవలం పాఠ్యాంశాన్ని డౌన్లోడ్ చేయడానికి మాత్రమే నెట్ అవసరం. తదుపరి ఆపాఠ్యాంశాన్ని మొబైల్ లో సేవ్ చేసుకుని ఎన్నిసార్లైనా ఆఫ్ లైన్ లో చూడవచ్చు.
★ కనుక ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ తప్పనిసరిగా దీక్షయాప్ ద్వారా/ దీక్ష సైట్ ద్వారా Energising Text Books లో ఉన్న పాఠ్యాంశాలను ఉపయోగించుకొవాలి. ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు దీనిపై అవగాహన కలిగించాలి.
0 Response to " మన పాఠ్యపుస్తకాలు ( ETBs), QR Codes తో"
Post a Comment