Diwali 2019: వాట్సప్‌లో దీపావళి స్టిక్కర్స్ ఇలా డౌన్‌లోడ్ చేయండి
దీపావళి పండుగ వచ్చేసింది. దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళిని ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష్మీ పూజ దగ్గర్నుంచి బాణాసంచా వరకు... ఎక్కడా ఏ లోటు లేకుండా ఘనంగా దీపావళి జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజలు. స్నేహితులు, బంధువులకు గిఫ్ట్స్ ఇచ్చేందుకు షాపింగ్ కూడా చేస్తున్నారు. దీపావళి విషెస్‌ను కాస్త స్పెషల్‌గా చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. మరి మీరు కూడా దీపావళి శుభాకాంక్షల్ని కాస్త క్రియేటీవ్‌గా చెప్పాలనుకుంటున్నారా? వాట్సప్ స్టిక్కర్స్‌తో సృజనాత్మకంగా విషెస్ చెప్పడానికి యాప్ స్టోర్‌లో దీపావళి స్టిక్కర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.
ముందుగా మీరు మీ వాట్సప్‌లో ఛాట్ విండో ఓపెన్ చేయండి
ముందుగా మీరు మీ వాట్సప్‌లో ఛాట్ విండో ఓపెన్ చేయండి
కొత్త విండోలో ఎమొజీ, గిఫ్ బటన్స్ పక్కన స్టిక్కర్స్ ఐకాన్ కనిపిస్తుంది.
స్టిక్కర్స్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ ఫోన్‌లో ఇప్పటికే మీరు డౌన్‌లోడ్ చేసుకున్న స్టిక్కర్స్ లిస్ట్ కనిపిస్తుంది.
చివర్లో కనిపించే + గుర్తును క్లిక్ చేస్తే మీ ఫోన్‌లో ఉన్న స్టిక్కర్ ప్యాక్‌ల వివరాలుంటాయి. అలాగే కిందకు స్క్రోల్ చేసి చివర్లో 'Get More Stickers' పైన క్లిక్ చేయాలి.
అప్పుడు యాప్ స్టోర్ ఓపెన్ అవుతుంది.
యాప్ స్టోర్‌లో Diwali Stickers for WhatsApp అని సెర్చ్ చేస్తే స్టిక్కర్ ప్యాక్స్ కనిపిస్తాయి.
స్టిక్కర్ ప్యాక్స్‌లో మీకు నచ్చినవి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన స్టిక్కర్ ప్యాక్ ఓపెన్ చేయాలి.
'Add to WhatsApp' పైన క్లిక్ చేస్తే ఆ స్టిక్కర్లు మీ వాట్సప్‌లోకి వచ్చేస్తాయి.
మీరు మళ్లీ వాట్సప్‌లో స్టిక్కర్స్ లిస్ట్‌లోకి వెళ్లి చూస్తే దీపావళి స్టిక్కర్లు కనిపిస్తాయి.
ఇలా కాకుండా మీరు నేరుగా యాప్ స్టోర్‌లోకి వెళ్లి కూడా దీపావళి స్టిక్కర్ ప్యాక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్ చేసిన వాటిలో కలర్‌ఫుల్ స్టిక్కర్‌ను మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు పంపొచ్చు
0 Response to "Diwali 2019: వాట్సప్‌లో దీపావళి స్టిక్కర్స్ ఇలా డౌన్‌లోడ్ చేయండి"
Post a Comment