'ఈ-దంతసేవ' వెబ్సైట్, యాప్ ప్రారంభం
న్యూఢిల్లీ: దంత సంరక్షణపై పౌరులకు అవగాహన కల్పించడం కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, ఎయిమ్స్ సంస్థ సంయుక్తంగా 'ఈ-దంతసేవ' పేరుతో ఓ వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్ను ఆవిష్కరించాయి.
దేశంలో ఉన్న దంత వైద్యశాలలు, కళాశాలలు, చికిత్స కేంద్రాలు తదితర వివరాలను ఈ అప్లికేషన్లో పొందుపరిచారు.
దంత చికిత్సాలయాలకు ప్రజలు సులభంగా చేరుకోవడానికి వెబ్సైట్లో జీపీఆర్ఎస్ సర్వీసును ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.
నోరు, దంత సమస్యలకు సంబంధించి ప్రజలకు చక్కని సలహాలు అందించడానికి ఈ అప్లికేషన్ సాయపడుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు
0 Response to "'ఈ-దంతసేవ' వెబ్సైట్, యాప్ ప్రారంభం"
Post a Comment