నిప్పులు కక్కే ‘మ్యాక్సీ’ కృష్ణబిలం!
పుణె, అక్టోబరు 12 : ఈ ఫొటోలో ఉన్నది ‘మ్యాక్సీ జే1820+070’ కృష్ణబిలం. పాలపుంతలో 10వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే దీన్ని 2018లో ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. నిప్పులు కక్కుతూ, పెళపెళ ధ్వనులు సృష్టిస్తూ ‘మ్యాక్సీ’ సాగించే గమనపు ఊహాచిత్రాన్ని పుణెలోని ఆస్ట్రోనమీ, ఆస్ట్రోఫిజిక్స్ అంతర్ విశ్వవిద్యాలయ కేంద్రం(ఐయూసీఏఏ), బ్రిటన్‌లోని సౌతాంప్టన్ వర్సిటీ శాస్త్రవేత్తల సంయుక్త బృందం విడుదల చేసింది. ఏడు సూర్యుళ్లను తెచ్చి.. లండన్ కంటే చిన్న నగరంలో ఇమిడేలా చేస్తే ఎలా ఉంటుంది!! దాదాపు అంతే ద్రవ్యరాశి, పరిమాణాలతో మ్యాక్సీ కృష్ణబిలం ఉంటుందని చెబుతారు. దీని నుంచి వెలువడే అతితీవ్ర రేడియేషన్ సమీపంలోని నక్షత్రాలనూ తినేసేంత శక్తివంతమైందని అంటారు.
అంత బ్రహ్మాండ ఆకారంపై జరిగే మహా విస్ఫోటనాలను, రేడియేషన్ ఘట్టాన్ని సాధారణ ఫొటోల తరహాలో చిత్రీకరించేందుకు ఖగోళజ్ఞుల బృందం స్పెయిన్‌లోని కెనరీ ద్వీపంలో ఉన్న గ్రాన్ టెలిస్కోప్ కేంద్రంలోని హ్యాపర్ కెమెరాను వినియోగించింది. అవే దృశ్యాలను ఎక్స్‌రే చిత్రాల తరహాలో బంధించేందుకు నాసా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఎన్‌ఐసీఈఆర్ అబ్జర్వేటరీలోని సాధనాలను వాడారు. వాటి సాయంతో సెకనుకు 300 ఫ్రేమ్‌ల చొప్పున చిత్రాలను బంధించగలిగారు. అంతవేగంగా కదిలే దృశ్యాలను కళ్లు స్పష్టంగా చూడలేవు. కాబట్టి దృశ్యం వేగాన్ని పదిలో ఒకటో వంతుకు తగ్గించి.. దాని ఆధారంగా ఊహాచిత్రాన్ని నిర్మించినట్లు శాస్త్రవేత్త జాన్ పైస్
0 Response to "నిప్పులు కక్కే ‘మ్యాక్సీ’ కృష్ణబిలం!"
Post a Comment