ఇంటర్వ్యూలు రద్దవుతున్న పోస్టులు ఇవే.

ఈ నేపథ్యంతో ఇంటర్వ్యూ విధానాన్ని స్వస్తీ పలుకుతున్న పోస్టులు ఇవే.. గ్రూప్-1 (గెజిటెడ్) కేటగిరీలో.. డిప్యూటీ కలెక్టర్, సీటీవో, డీఎస్పీ, జిల్లా పంచాయతీరాజ్ అధికారి, ఎంపీడీవో, ప్రాంతీయ రవాణా శాఖాధికారి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, డివిజినల్ ఫైర్ ఆఫీసర్, జిల్లా రిజిస్ట్రార్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి, జిల్లా ఉపాధి కల్పనా శాఖాధికారి, అసిస్టెంట్ ట్రెజరీ/అకౌంట్స్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ (సహకార శాఖ), జిల్లా సంక్షేమ శాఖాధికారి, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 తదితర పోస్టులు


గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి 750 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. 75 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే, గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్ పరీక్ష 450 మార్కులకు నిర్వహిస్తారు. కొన్ని పోస్టులకు మాత్రమే 75 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

అలాగే.. గ్రూప్-2 (గెజిటెడ్) కేటగిరీలో.. అసిస్టెంట్ కమిషనర్ (దేవాదాయ శాఖ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి, అసిస్టెంట్ డెరైక్టర్ (పరిశ్రమల శాఖ), ఏసీఎఫ్అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్, డిప్యూటీ ఈవో/గెజిటెడ్ హెడ్‌మాస్టర్ (పాఠశాల విద్య), జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి తదితర పోస్టులకు ఇంటర్వ్యూలు ఇకపై ఉండవు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇంటర్వ్యూలు రద్దవుతున్న పోస్టులు ఇవే."

Post a Comment