పోలింగ్ అప్‌డేట్స్ : ఓటేసిన సచిన్ ఫ్యామిలీ
ముంబై/చండీగఢ్ : మహారాష్ట్ర, హరియాణాలలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మహారాష్ట్రలోని 288, హరియాణాలోని 90 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల బందోబస్తు కోసం మహారాష్ట్రలో 3 లక్షల మందిని, హరియాణాలో 75 వేల మంది పోలీసులను మోహరించారు. మహారాష్ట్రలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ, దాని మిత్రపక్షాలు వరుసగా రెండోసారి కూడా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు కూడా నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి
ఉదయం 11 గంటల వరకు హరియాణాలో 23.12 శాతం, మహారాష్ట్రలో 16.34 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం అంచనా వేసింది
- ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే, ఆయన భార్య షర్మిల ఠాక్రేలు శివాజీ పార్క్‌లోని బాలమోహన్ విద్యామందిర్ పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, ఆయన సతీమణి రష్మీ, కుమారుడు ఆదిత్య ఠాక్రేలు బాంద్రా(తూర్పు)లో వారి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, ఆదిత్య ఠాక్రే వర్లి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.
- క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆయన సతీమణి అంజలి, కుమారుడు అర్జున్ బాంద్రా(పశ్చిమ) పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు
- మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన సతీమణి అమృత, తల్లి సరిత నాగ్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోరట్ కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు
పోలింగ్ బూత్‌కి సైకిల్‌పై సీఎం
హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పోలింగ్ బూత్‌కి సైకిల్‌పై వచ్చారు. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు.
- హరియాణాలో ఉదయం 10 గంటల వరకు 10.72 శాతం పోలింగ్ నమోదైంది
- భారత మాజీ టెన్నిస్ ఆటగాడు మహేష్ భూపతి, అతని భార్య ప్రముఖ నటి లారా దత్తాలు ముంబైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- ఉదయం 9 గంటల వరకు మహారాష్ట్రలో 5.29 శాతం, హరియాణాలో 6.07 శాతం పోలింగ్ నమోదైంది.
- జేజేపీ నాయకుడు దుష్యంత్ చౌతాలా కుటుంబసభ్యులతో కలిసి ట్రాక్టర్‌లో పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. సిర్సాలోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- కాంగ్రెస్ సీనియర్ నాయకులు రణ్‌దీప్ సుర్జేవాలా, ఆయన భార్య హరియాణాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కైతాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు
0 Response to "పోలింగ్ అప్‌డేట్స్ : ఓటేసిన సచిన్ ఫ్యామిలీ"
Post a Comment