చిటికెలో పెద్ద సంఖ్యల గుణకారాలు

పారిస్‌, అక్టోబరు 18: రెండో ఎక్కం నుంచి ఇరవయ్యో ఎక్కం దాకా బట్టీ కొట్టడం. ఎక్కడ ఏ గుణకారం చేయాల్సి వచ్చినా ఆ ఎక్కాల ఆధారంగా చెయ్యడం.. మనందరం సహజంగా చేసేదే! కానీ, పెద్ద సంఖ్యలతో.. అంటే మూడంకెలు, నాలుగంకెలు, ఐదంకెల సంఖ్యలతో గుణకారం చేయడం అంత సులువు కాదు. ఒక పరిమితి వరకూ కాలుక్యులేటర్లు, కంప్యూట ర్లు కూడా ఆ లెక్కల్ని వేగంగానే చేయగలవు. కానీ, వాటి వల్ల కూడా కానంత పెద్ద సంఖ్యలతో గుణకారం చేయాల్సి వస్తే? అలాంటి గుణాకారాల్ని అత్యంత సులభంగా చేసే సూత్రాన్ని తాము పరిష్కరించామని


ఇద్దరు గణిత శాస్త్రవేత్తలు డేవిడ్‌హార్వే (ఆస్ట్రేలియా), జోరిస్‌ వాన్‌ డర్‌ హోవెన్‌ (ఫ్రాన్స్‌) ప్రకటించారు. అలాంటి పెద్ద అంకెల గుణకారంపై జర్మనీకి చెందిన గణిత శాస్త్రజ్ఞులు షాన్‌హేజ్‌-స్ట్రాసెన్‌ ఒక అల్గారిథమ్‌ను 1970ల్లో ప్రతిపాదించారు. కానీ, ఈ ఐదు దశాబ్దాల్లో ఎవరూ దాన్ని నిరూపించలేకపోయా రు. దాన్నే ఇప్పుడు తాము పరిష్కరించామని హార్వే జోడీ ప్రకటించింది. సాధారణంగా.. వంద కోట్ల అంకెలున్న ఒక సంఖ్యను, వంద కోట్ల అంకెలున్న మరో సంఖ్యతో మల్టిప్లై చేయాలంటే కంప్యూటర్‌కు సైతం కొన్ని నెలల సమయం పడుతుంది. కానీ, తాము రూపొందించిన అల్గారిథమ్‌తో కేవలం 30 సెకన్లలోనే ఆ లెక్క చేయొచ్చని వారు చెబుతున్నారు. ్ఞఅయితే ఆ అల్గారిథమ్‌ గురించి మాత్రం వారు ఒక్క విషయం కూడా బయటపెట్టలేదు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "చిటికెలో పెద్ద సంఖ్యల గుణకారాలు"

Post a Comment