కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త. కొత్తగా గృహ నిర్మాణ రుణం తీసుకోబోయే ఉద్యోగులకు వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 7.9 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. 




ఈ పథకం ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా ఏడాదిపాటు ఈ వడ్డీ తగ్గింపు అమల్లో ఉంటుందని కూడా తెలిపింది.



 శాశ్వత ఉద్యోగులు, బ్రేక్‌ లేకుండా ఐదేళ్లుగా ఉద్యోగం చేస్తున్న తాత్కాలిక సిబ్బంది ఈ వడ్డీ తగ్గింపునకు అర్హులు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త"

Post a Comment