ప్రపంచ కుబేరుడిగా మళ్లీ బిల్‌గేట్స్‌.

తగ్గిన జెఫ్‌ బెజోస్‌ సంపద 
- రెండో స్థానానికి పతనం 

వాషింగ్టన్‌ : ఇన్నాళ్లుగా ప్రపంచ కుబేరుడిగా కొనసాగు తున్న బెజోస్‌ స్థానాన్ని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ సొంతం చేసుకున్నారు. అమె జాన్‌ షేర్లు పతనమైన నేపథ్యంలో కంపెనీ సిఇఒ జెఫ్‌ బెజోస్‌ భారీగా సంపద కోల్పోయారు. దీంతో ఆయన రెండో స్థానంలోకి నెట్టబడ్డారు. 2019 సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాల్లో అమెజాన్‌ భారీ నష్టాలు చూసింది. 2017 తర్వాత తొలిసారిగా కంపెనీ నికర ఆదాయంలో 26 శాతం తగ్గుదల నమోదైంది. దీంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు ఏడు శాతం మేర పడిపోయింది.ఈ నేపథ్యంలో ఏడు బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.50వేల కోట్లు) మేర సంపద బెజోస్‌ 


దీంతో ఆయన సంపద 103.9 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. బిల్‌ గేట్స్‌ ప్రస్తుతం సంపద 105.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. దీంతో బిల్‌గేట్స్‌ మరోసారి ప్రపంచ కుబేరుడిగా నిలిచారని పలు నివేదికలు పేర్కొన్నాయి. 1987లో ప్రపంచ సంపన్నుడిగా ఫోర్బ్‌ జాబితాలో తొలిసారిగా స్థానం దక్కించుకున్న బిల్‌ గేట్స్‌ 24 ఏళ్ల పాటు అదే స్థానంలో కొనసాగారు.

ఇక 1998లో అమెరికా సంపన్నుల జాబితాలో ఒకరిగా నిలిచిన బెజోస్‌.. అమెజాన్‌ షేర్లు భారీగా ఎగిసిన నేపథ్యంలో 2018లో తొలిసారిగా బిల్‌ గేట్స్‌ను వెనక్కినెట్టి 169 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుడిగా అవతరించారు. అయితే ప్రస్తుతం అమెజాన్‌ షేర్ల పతనం, భార్య మెకాంజీకి భరణం రూపంలో దాదాపు 39 బిలియన్‌ డాలర్ల విలువ గల షేర్లు బదలాయించడంతో బెజోస్‌ రెండో స్థానానికి పడిపోయారు. ఆయన బార్య మెకంజీ బెజోస్‌ నుంచి ఇటీవలే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రపంచ కుబేరుడిగా మళ్లీ బిల్‌గేట్స్‌."

Post a Comment