గిన్నిస్ రికార్డు సాధించిన అయోధ్య దీపోత్సవం
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఏర్పాటు చేసిన దీపోత్సవ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. అయోధ్య దీపోత్సవాన్ని రాష్ట్ర పండగగా ప్రకటించిన యూపీ సర్కార్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా
నిర్వహిస్తోంది. 5.51 లక్షల దీపాలతో రాష్ట్రప్రభుత్వం ఆయోధ్య నగరాన్ని సుందరంగా అలంకరించింది. ఈ సందర్భంగా సాకేత్ కళాశాల నుంచి రామకథ పార్కు వరకు సీతారాముల ఊరేగింపు, అనంతరం శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. దీపోత్సవ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి కళాకారులు పాల్గొన్నారు. 2500 మంది విద్యార్థులు గీసిన రాముని జీవితంలోని వివిధ ఘట్టాల చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఫిజీ రిపబ్లిక్ డిప్యూటీ స్పీకర్ వీణా భట్నగల్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు
0 Response to "గిన్నిస్ రికార్డు సాధించిన అయోధ్య దీపోత్సవం"
Post a Comment