మధ్యాహ్న భోజన పథకంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష

*✨ మధ్యాహ్న భోజన పథకంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష*


★ మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచడంపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశం. 

*★ అదే విధంగా మధ్యాహ్న భోజనంలో పిల్లలకు మరో ప్రత్యేక వంటకం ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచన.*

★ స్కూళ్లలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి సీఎం జగన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

★ నవంబర్‌ నుంచి స్కూళ్లలో పనులు ప్రారంభించి... మార్చికల్లా పనులు పూర్తిచేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

★ స్కూళ్లలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ఇస్తున్న పరికరాలు అన్నీకూడా నాణ్యంగా ఉండాలని సీఎం ఆదేశం.

★ సౌకర్యాల కల్పనలో ఏ ఇతర స్కూళ్లకూ తీసిపోకూడదని సూచన. 

★ పది రూపాయలు ఎక్కువైనా సరే సౌకర్యాల కల్పనలో మాత్రం రాజీపడవద్దని సీఎం వ్యాఖ్య.

★ అనుకున్న ప్రకారం వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి స్కూలు యూనిఫారమ్స్, పుస్తకాలు అందించాలని సీఎం ఆదేశాలు జారీ.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " మధ్యాహ్న భోజన పథకంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష"

Post a Comment