ఆ వ్యక్తికి గుండె కుడి వైపున ఉందట..
లఖ్‌నవూ: ఒక సాధారణ మనిషికి శరీరంలో హృదయం ఏ వైపున ఉంటుంది అంటే ఎడమ వైపు అని టక్కున చెప్తారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక వ్యక్తికి మాత్రం కుడి వైపున ఉండటం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక గుండె మాత్రమే కాదు అతని శరీరంలోని దాదాపు చాలా అవయవాలు ఇతర భాగాల్లో ఉండటం గుర్తించిన వైద్యులు షాకయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుషినగర్ పాద్రౌనాకు చెందిన జమాలుద్దీన్‌కు చూడటానికి సాధారణంగానే ఉన్నా శరీరంలోని అవయవాలు సరైన క్రమంలో లేకపోవడం గమనార్హం. ఇటీవల అతడు కడుపు నొప్పితో గోరఖ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతడికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ నివేదికల్లో అవయవాల స్థానం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు
అనంతరం వైద్యుడు శశాంక్ దీక్షిత్ మాట్లాడుతూ.. 'అతడికి పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించాం. కానీ అది అందరికీ భిన్నంగా అతడికి ఎడమ వైపున ఉండటం వల్ల తొలగించడానికి చాలా కష్టమైంది. ఇందుకోసం మేము మూడు విధాల ల్యాప్రోస్కోపిక్ యంత్రాలను ఉపయోగించినట్లు తెలిపారు.
ప్రస్తుతం అతడు కోలుకునే దశలో ఉన్నారు. అతడికి గుండె కుడివైపున, కాలేయం ఎడమవైపున ఇలా అంతా వేర్వేరు భాగాల్లో అవయవాలున్నాయి. నేను ఇప్పటివరకు చూసిన కేసుల్లో అవయవాలు సరైన భాగాల్లో లేకుండా ఉన్న కేసు ఇదే మొదటి సారి. ఇలాంటివారికి శస్త్రచికిత్సలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని' అని చెప్పారు

0 Response to "ఆ వ్యక్తికి గుండె కుడి వైపున ఉందట.."
Post a Comment