వడ్డీరేట్లను తగ్గించిన ఎస్బీఐ
మరోవైపు, పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా ఎస్బీఐ వడ్డీరేట్లను సవరించింది. రూ. లక్షకు పైగా పొదుపు ఖాతాలపై 3.5శాతం నుంచి 3.25శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా రేట్లు నవంబనే 1 నుంచి అమలులోకి రానున్నాయి. అలాగే వివిధ కాలపరిమితులకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లపైనా వడ్డీరేట్లను 10 నుంచి 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. బల్క్ డిపాజిట్లకు సైతం ఈ తగ్గింపు వర్తించనుంది. సవరించిన వడ్డీ రేట్లు అక్టోబరు 10నుంచి అమలులోకి రానున్నాయి. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటును మాత్రం అలాగే కొనసాగిస్తోంది. ఇక, 7 నుంచి 45 రోజుల కాల పరిమితి కలిగిన డిపాజిట్లపై 4.5 శాతానికి, 46 నుంచి 179 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 5.50 శాతానికి, 180 నుంచి సంవత్సర కాలపరిమితి గల డిపాజిట్లపై కూడా 5.80శాతానికి వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయించింది
0 Response to "వడ్డీరేట్లను తగ్గించిన ఎస్బీఐ"
Post a Comment