రేపు దేశంలో ఒక రాష్ట్రం అదృశ్యం
దేశ ప్రజలకు 2019 అక్టోబర్ 31 ఒక మరపురాని రోజు కానుంది. దేశంలో ఒక రాష్ట్రం అదృశ్యం కావడంతోపాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు కొత్తగా జాబితాలో చేరడాన్ని చూస్తారు. గురువారం నుంచి జమ్మూ కశ్మీరు ఇక రాష్ట్రం కాదు. ఆగస్టు 9న రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వుల మేరకు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా
అవతరిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పనిచేసిన మాజీ ఉన్నతాధికారి జిసి ముర్ము జమ్మూ కశ్మీరు తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారు. మరో సీనియర్ మాజీ అధికారి రాధా కృష్ణ మాథుర్ లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తారు. కశ్మీరు కేంద్రపాలిత ప్రాంతంగా మారినప్పటికీ ఢిల్లీ తరహాలో అసెంబ్లీ
కాని లడఖ్‌లో మాత్రం అసెంబ్లీ ఉండదు. అది నేరుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహణలో ఉంటుంది. కాగా, జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకునే దేశ తొలి హోం మంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి..అక్టోబర్ 31 నాడు కొత్తగా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడడం మాత్రం విశేషం
0 Response to "రేపు దేశంలో ఒక రాష్ట్రం అదృశ్యం"
Post a Comment