ఉద్యోగులకు మరో తీపికబురు...వేతన పెంపుపై చర్చలు

ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపుతో ఇప్పటికే దీపావళి గిఫ్ట్ అందించించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగులకు ఇంకొక తీపికబురు అందిచనుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఉద్యోగుల వేతనాన్ని పెంచాలని కేంద్ర భావిస్తున్నట్లు తెలుస్తోంది. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్‌డీఏ గవర్నమెంట్ ఉద్యోగుల వేతన పెంపుపై ప్రధానంగానే దృష్టి సారించినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 7వ సీపీసీ వేతన పెంపు ప్రతిపాదనపై తగిన నిర్ణయం తీసుకోబోతోందనే అంచనాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది. నవంబర్‌లో జరగనున్న మీటింగ్‌లో ఈ అంశంపై ఒక నిర్ణయం వెలువడొచచనే అంచనాలున్నాయి.ఇకపోతే వేతన పెంపు అంశానికి సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారం లేదు



కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే డియర్‌నెస్ అలవెన్స్‌ను 5 శాతం పెంచిన విషయం తెలిసిందే. దీంతో డీఏ 12 శాతం నుంచి 17 శాతానికి పెరిగింది. జూలై నుంచి ఈ నిర్ణయం వర్తిస్తుంది. డీఏ పెంపు వల్ల 50 లక్షల మంది ఉద్యోగులకు, 65 లక్షల మంది పెన్షన్లకు ప్రయోజనం లభించింది.ఇకపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో కనీస వేతనం, ఫిట్‌మెంట్ పెంపు కోసం డిమాండ్ చేస్తూనే వస్తున్నారు. 7వ సీపీసీ ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకోలేదని, ఇప్పుడు ధరలు కూడా పెరిగిపోయాయని, దీంతో వేతన పెంపు వల్ల కలిగే ప్రయోజనం స్వల్పమేనని పేర్కొంటున్నారు.మోదీ సర్కార్ ఇదివరకు కనీస వేతనాన్ని రూ.18,000కు పెంచింది. అయితే ఇప్పుడు ఉద్యోగులు మాత్రం రూ.26,000 కనీస వేతనాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం ఈ డిమాండ్లకు స్పందించడం లేదు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉద్యోగులకు మరో తీపికబురు...వేతన పెంపుపై చర్చలు"

Post a Comment